పశ్చిమగోదావరి

రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 7: రోడ్డు ప్రమాదాల సంఖ్య జీరోస్థాయికి చేరేలా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. 30వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా వల్లూరులోని శ్రీరామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయని అన్నారు. ముఖ్యంగా యువత తివేగంగా వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు శోకం మిగులుతుందన్నారు. రెండు చక్రాల వాహనాలు నడిపేవారు హెల్మెట్లను, నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీట్ బెల్టును ధరించాలని కలెక్టర్ చెప్పారు. అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు వాటిల్లుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఇటువంటి విషయాలకు దూరంగా ఉండి వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. రైల్వే క్రాసింగ్‌లు, హైవే రోడ్డు క్రాసింగ్‌ల వద్ద అప్రమత్తంగా వాహనాలను నడపాలని ఆయన చెప్పారు. కాలేజీల్లో యాజమాన్యం విద్యార్థినీ, విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో డీటీసీ ఎస్‌ఎస్ మూర్తి, ఆర్టీవో మల్లికార్జునరెడ్డి, శ్రీరామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డోలా సంజయ్, సెక్రటరీ కె వేణుగోపాల్, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్
*అధికారులకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 7: రానున్న వేసవిలో తాగునీటి సమస్య రాకుండా గ్రామాల వారి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం పంచాయతీ ప్రగతి తీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం స్థానిక వనరులు, జడ్పీ నిధులు వినియోగించుకోవాలని, ఇతర అత్యవసర సమయంలో అవసరమైన నిధులు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రతి నివాసిత ప్రాంతానికి తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని, ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. గ్రామాల్లో చేతిపంపుల మరమ్మతులు, వాటికి అవసరమైన స్పేర్‌పార్ట్‌లు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం ద్వారా సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలన్నారు. జిల్లాలో 909 గ్రామ పంచాయతీల్లో 1437 సిడబ్ల్యు స్కీమ్‌లు, 21 సిపిడబ్ల్యుఎస్, 480 ఎంపిడబ్ల్యుఎస్, 3,117 హ్యాండ్ పంపులు ఉండగా 115 గ్రామ పంచాయతీలకు సత్యసాయి వాటర్ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. జిల్లా అభివృద్ధికి గ్రామాభివృద్ధే అద్దం పడుతుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ స్థానిక వనరులతోపాటు గత కాలంగా ఉపాధి హామీ నిధులు సమన్వయం చేసుకోవడం ద్వారా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి డివిజనల్ పంచాయతీ అధికారులు, ఇవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన మూడంచెల స్థాయిలో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాలకంటె ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రకృతి సంపద, మానవ వనరులు ఎక్కువగా ఉండటం మూలంగా ఈ ప్రాంతాల ప్రగతి బాగుందన్నారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రజా సంతృప్తికి అనుగుణంగా గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో ఆన్‌లైన్ ద్వారా పన్నుల చెల్లింపుల విధానంపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. జిల్లాలో 7,07,684 అస్సెస్‌మెంట్ ఉండగా వారి నుండి పన్ను వసూలుకు డిమాండ్ ఏ మాసంలో జారీ చేశారో అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా పన్నులు వసూలు అయ్యేలా శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద 7.07 లక్షల ఆవాసాల నుండి చెత్త సేకరించేందుకు 1605 బ్లాక్‌లు ఏర్పాటు చేసి, బ్యాటరీ వాహనాల ద్వారా చెత్త సేకరణ చేస్తున్న అంశంపై కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత వాహనాలకు ఏర్పడే మరమ్మతులను త్వరితగతిన చేయించుకుని వినియోగంలో ఉంచాలన్నారు. ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఆయా గృహాలకు చెత్త బుట్టలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మినీ మీసేవా కేంద్రాల ద్వారా గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వి నాగార్జునసాగర్, డివిజనల్ పంచాయతీ అధికారులు చిన్నారావు, ఎస్‌ఎ మూర్తి, నాగలతలతోపాటు పలువురు ఈవోఆర్డీలు పాల్గొన్నారు.