పశ్చిమగోదావరి

పేదవాడి సొంతింటి కల సాకారానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 7: పేదవాడి సొంతింటి కల సాకారానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోందని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్లో గురువారం నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 13 గ్రామాలకు చెందిన 752 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు, 449 మందికి రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతోపాటు ప్రభుత్వ సహకారంతో ఇల్లు నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ భవనాలకు రూ.కోటి నిధులు వచ్చాయన్నారు. మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో లబ్ధిదారులకు అర్బన్ హౌసింగ్ స్కీములో ఎల్ అగ్రహారం వద్ద 5376 ఇళ్లు నిర్మించామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి నాగమణి, ఏవీ రమణ, ఎంపీడీవో వీవీ రామాంజనేయశర్మ, జీవీకే మల్లికార్జునరావు, ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కొండపల్లి రాయుడు తదితరులు పాల్గొన్నారు.