పశ్చిమగోదావరి

మీకోసంకు అధికార్ల గైర్హాజర్‌పై ఆర్డీవో ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, ఫిబ్రవరి 18: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరుకావడంపై ఆర్డీవో ఏఎన్ సలీంఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు హాజరుకాకపోవడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేసారు. చరవాణి ద్వారా ఆయన ఆయా అధికారుల వివరణ కోరారు. దీంతో గైర్హాజరు అయిన అధికారులు హుటాహుటిన మీకోసం కార్యక్రమానికి తరలివచ్చారు. అనంతరం ఆర్డీవో సలీంఖాన్ ప్రజల నుంచి 35 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కొక్కిరిగడ్డ జ్వోతి తన భర్తపై దాడిచేసి గాయపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన నక్కా వెంకట స్వామి ప్రభుత్వం మంజూరు చేసిన రెండు సెంట్ల భూమి తమకు అప్పగించాలని కోరారు. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన మంతెన సీతమ్మ తన రెండవ కుమార్తె మోసం చేసి ఆస్ధి కాజేసిందని న్యాయం చేయాలని కోరారు. పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన కుప్పాల మావుళ్ళమ్మ తన ఇంటి సరిహద్దు సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో జి నరేష్ కుమార్, గణాంక అధికారి శ్యామ్ సుందర్ ప్రసాద్, గృహ నిర్మాణ సంస్థ అధికారి సిద్ధాంతి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, వ్యవసాయ అధికారి వై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.