పశ్చిమగోదావరి

నాటుసారా అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, డిసెంబర్ 26: నాటుసారా వల్ల అనేక అనర్థాలు, ప్రాణహాని కలుగుతున్నాయని, నాటుసారాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవరపల్లిలో శనివారం నాటుసారా అనర్థాలపై కొవ్వూరు ఎక్సైజ్ సిఐ పి గిరిజా సత్యకుమారి ఆధ్వర్యంలో జరిగిన నాటుసారా అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎక్సైజ్ సిఐ సత్యకుమారి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటుసారా వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని, ఇది అందరూ గ్రహించాలన్నారు. ముఖ్యంగా యువత నాటుసారా బారినపడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యానికి హానికరమైన ఈ నాటుసారా విక్రేతలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా పూర్తిస్థాయిలో అరికట్టలేక పోతున్నారన్నారు. నాటుసారా విక్రేతలను గుర్తించి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎక్సైజ్ సిఐ గిరిజా సత్యకుమారి మాట్లాడుతూ నాటుసారా విక్రేతలపై అనేక కేసులు పెడుతున్నామన్నారు. అవసరమైతే పిడి యాక్టును ప్రయోగిస్తామని ఆమె హెచ్చరించారు. నాటుసారా విక్రయిస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. స్వచ్ఛందంగా నాటుసారా విక్రయాలను వదులుకోవాలని ఆమె సూచించారు. సదస్సులో ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, ఎంపిపి శ్రీకాకుళపు వెంకట నరసింహారావు, మండల దేశం అధ్యక్షుడు సుంకర దుర్గారావు, జిల్లా దేశం అధికార ప్రతినిధి కొయ్యలమూడి చినబాబు, ఉపాధ్యక్షుడు పిన్నమనేని శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడారు. అంతకుముందు నాటుసారాకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ సిఐ గిరిజా సత్యకుమారి ఆధ్వర్యంలో నాటుసారాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్థానిక టిడిపి నాయకులు తంగెళ్ల మునేశ్వరరావు, యాగంటి వెంకటరత్నం, ఇఒపిఆర్డీ శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఎస్‌ఐలు తాతారావు, బాలాజీ, ఐకెపి ఎపిఒ మంగతాయారు, డ్వాక్రా సిఐలు పాల్గొన్నారు.
మట్టి సత్యాగ్రహానికి పోలవరం వస్తున్న నేతలు
-పిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్
కొవ్వూరు, డిసెంబర్ 26: పోలవరంలో ఈ నెల 29న జరగనున్న మట్టి సత్యాగ్రహంలో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షుడు ఎం రఘువీరారెడ్డి, ఎంపి కెవి రామచంద్రరావు, కాంగ్రెస్ నాయకులు జెడి శీలం, టి సుబ్బిరామిరెడ్డి వస్తున్నట్టు ఎపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ తెలిపారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో శనివారం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్‌టి, బిసి మైనార్టీల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న గౌతమ్ విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఈ మట్టి సత్యాగ్రహం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. డిసిసి అధ్యక్షుడు ఎండి రఫీయుల్లా బేగ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలవరంలో జరిగే మట్టి సత్యాగ్రహాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా బాబూరావుకు నియామక పత్రాన్ని ఈ కార్యక్రమంలో అందజేశారు. సమావేశంలో ఎస్‌టి సెల్ రాష్ట్ర ఛైర్మన్ కె సుధాకర్‌బాబు, బిసి సెల్ ఛైర్మన్ ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ ఛైర్మన్ జాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.