పశ్చిమగోదావరి

అక్రమంగా తరలిస్తున్న రేషను బియ్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమడోలు, మార్చి 11: భీమడోలు, దెందులూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో రేషను వినియోగదారుల నుండి కొనుగోలు చేసిన బియ్యాన్ని మిల్లులకు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంటు సీఐ జీపీవి నాగేశ్వరరావు తెలిపారు. భీమడోలు రైల్వేస్టేషను సమీపంలో తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని తరలిస్తున్న మూడు గూడ్స్ ఆటోలు, ఒక ప్యాసింజరు ఆటోను సీజ్ చేశామని, ఈ ఆటోల్లో తరలిస్తున్న సుమారు 65 వేల రూపాయల విలువైన 36 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు నాగేశ్వరరావు చెప్పారు. ఈ బియ్యాన్ని భీమడోలు సివిల్ సప్లయిస్ డీటి పూర్ణచంద్ర ప్రసాద్‌కు అప్పగించామన్నారు. ఆటో డ్రైవర్లు ఎం శివ, ఎ రామాంజనేయులు, టి నాగరాజు, కె వీరబాబును అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దెందులూరు, భీమడోలు, గుండుగొలను, భోగాపురం గ్రామాల నుండి ఈ బియ్యం సేకరించినట్టు వారు తెలిపారన్నారు. ఈ బియ్యాన్ని రెండు ఆటోలలో పూళ్ల గ్రామానికి చేర్చేందుకు తమతో ఒక వ్యక్తి కిరాయి మాట్లాడుకున్నాడని ఆటో ట్రైవర్లు చెప్పారు. దెందులూరు ప్రాంతంలో సేకరించిన బియ్యాన్ని ఏలూరు తరలించి అక్కడ నుండి ఆటోల్లో కైకరం తరలించేందుకు డ్రైవర్లతో కిరాయి కుదుర్చుకున్నట్టు సీఐ చెప్పారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్సుమెంటు తహసీల్దారు కె రవికుమార్, జి జయప్రసాద్, ఏవో ఎం శ్రీనివాసకుమార్, భీమడోలు సిఎస్‌డీటీ పూర్ణచంద్రప్రసాద్, వీఆర్వో ప్రసాద్ పాల్గొన్నారు.
సెల్‌ఫోను పేలి యువకునికి గాయాలు
వేలేరుపాడు, మార్చి 11: సెల్‌ఫోను పేలిన ఘటనలో వేలేరుపాడు మండలం బండలబోరు గ్రామానికి చెందిన గొల్లమోతుల పోసి అనే యువకునికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోసి ఫోనులో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఫోను పేలడంతో అతని చెవికి, చేతికి, తొడపై గాయాలయ్యాయి. స్థానికులు అతనిని వెంటనే వేలేరుపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.