పశ్చిమగోదావరి

వైసీపీ నేతల ప్రచారం హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 9: 11వ తేదీన జరగనున్న పోలింగ్ ఏకపక్షంగా జరుగుతుందని, వచ్చేది జగననే్ననని, మార్పు తెచ్చేదీ జగననే్ననని ఓటర్లు తేల్చి చెప్పేస్తున్నారని వైసీపీ చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి వున్నమట్ల ఎలీజా, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి (సోంబాబు) అన్నారు. మంగళవారం చివరి రోజు పట్టణంలోని ఎస్సీపేటలు, ఇతర ప్రధాన రహదార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి వృత్తిదారులు, చిరువ్యాపారులను కలిశారు. ఓటర్లతో మమేకమై జగనన్నను సీఎం చేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో వివరించారు. అవినీతి టీడీపీ పాలనకు చరమగీతం పాడి, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు వివరించారు. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. వైసీపీ హామీలు వివరిస్తూ ఓటర్లకు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి వున్నమట్ల ఎలీజా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పాలన అంతం కానుందని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. జగన్ సీఎం అయితే బీసీ సంక్షేమం సాధ్యమన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా రూ.పది వేల కోట్లతో ఐదేళ్లలో రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఐదేళ్లలో కనీసం 20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి రూ.15వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తుందన్నారు. రాజకీయ ఎదుగుదల కోసం ఆన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రాజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్, కాంట్రాక్ట్ వర్స్‌లో కూడా 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు చట్టం తెస్తామన్నారు. బీసీల్లోని ఉప కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్సార్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్సార్ పెళ్లి కానుకగా రూ.50వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాతినిధ్యంలేని బీసీ కులాలకు వీలైనంతగా చట్టసభల్లో అవకాశం కల్పించడానికి కృషి చేస్తామన్నారు. బీసీ జనగణన చేసి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ పంపిస్తామని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుచేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ప్రమాదవశాత్తూ బీసీ కులాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి (సోంబాబు) మాట్లాడుతూ చిన్న వ్యాపారాలు చేసుకునే నారుూ బ్రాహ్మణులు, లాండ్రీ షాపులు నడుపుకునే రజకులకు, టైలర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆర్యవైశ్య సత్రాలను నడిపే హక్కు వారికే కల్పిస్తామని చెప్పారు. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు ముఖ్యంగా రోడ్డు పక్కన సామాన్లు అమ్ముకునేవారికి, తోపుడు బండ్లమీద కూరగాయలు, టిఫిన్లు అమ్ముకునేవారికి రోజుకు రూ.2వేల నుండి రూ.3వేలు పెట్టుబడి కోసం రూ.3-4 నుండి రూ.10 వడ్డీకి అప్పులు తీసుకుని అవస్థలు పడుతున్నారని, అటువంటి చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి జగనన్న వారికి రూ.10 వేలు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారని చెప్పారు. అన్నివర్గాల సంక్షేమమే జగనన్న ధ్యేయమని, అందువల్ల ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కోటగిరి శ్రీ్ధర్ పోటీ చేస్తున్నారని, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థిగా వున్నమట్ల ఎలీజా పోటీ చేస్తున్నారని, వీరిద్దరిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతుల రామతిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు వీవీఎస్ రామారావు, పీపీఎన్ చంద్రరావు, వందనపు సాయిబాలపద్మ, మేడవరపు విద్యాసాగర్, బీవీఆర్ చౌదరి, తాతకుంట్ల రవికుమార్, వందనపు వెంకటేశ్వరరావు, చిటికిల అచ్యుత రామయ్య, ఫర్వేజ్, ముప్పిడి వీరాంజనేయులు, కె శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.