పశ్చిమగోదావరి

జై కాంగ్రెస్.. జై జెట్టి ... నినాదాలతో మార్మోగిన జంగారెడ్డిగూడెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణం జై కాంగ్రెస్, జై జెట్టి నినాదాలతో మార్మోగింది. పట్టణంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీ సుడిగాలిలా సాగింది. ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జెట్టి గురునాధరావుకు అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పట్టారు. ఆయనపై గత 30 సంవత్సరాలుగా గుండెల్లో నింపుకున్న అభిమానాన్ని జనం చాటిచెప్పారు. ఈ ప్రాంతంలో ప్రధాన పార్టీలు సైతం చేయలేని ర్యాలీ గురునాధరావు సారధ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. పాత బస్టాండ్ వద్ద నుండి మంగళవారం వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల మోటార్ సైకిల్ ర్యాలీతో గురునాధరావు ప్రచార రథం ముందుకు సాగింది. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, వైఎస్‌ఆర్ నగర్, పాత బస్టాండ్, ఎస్సీ పేటలు 5,6 వార్డులు, ఇ.సేవా సెంకర్, పరెడ్డిగూడెం, మారుతీనగర్, రామచంద్రపురం, రాజులకాలనీ, సుబ్బారెడ్డి కాలనీ, అయ్యన్నకాలనీ, ఉప్పలమెట్ట, డాంగేనగర్, రాజీవ్‌నగర్, బాలాజీ నగర్, ఎన్టీఆర్ నగర్, బైపాస్ రోడ్డు, గరుడపక్షి నగర్, బుట్టాయగూడెం రోడ్డు, జెపి సెంటర్, ఊరచెరువు తదితర ప్రాంతాలలో గురునాధరావు చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి మారుమూడి థామస్‌ను పరిచయం చేస్తూ రోడ్‌షో నిర్వహించారు. ఎస్సీ పేటలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ ర్యాలీలో ఆద్యంతం కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జై కాంగ్రెస్, జై రాహుల్, జై జెట్టి నిదాదాలు మార్మోగించారు. ఈ సందర్భంగా జెట్టి గురునాధరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం రాష్ట్ర ప్రజలకు చారిత్రక అవసరమన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ అధికారంలోకి వస్తే నెరవేర్చ నిజమైన పార్టీ కాంగ్రెస్ అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు అధోగతి పాలయ్యారన్నారు. జీరో బ్యాలన్స్ ఖాతాలు పేదలతో తెరిపించి ఒక్క రూపాయి కూడ వారి ఖాతాలో ప్రధాని మోదీ వేయలేదన్నారు. కార్పోరేట్ సంస్థలకు లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసారని, లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారని, ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ ఎజెండాలోని తొలి అంశమన్నారు. ఈ రాష్ట్రంలో యువత, రైతులు అన్ని వర్గాల తలరాతలు మారాలంటే ఒక్క ప్రత్యేక హోదా వల్లే సాధ్యమన్నారు. పేదరికం దేవుడి శాపం కాదని, మనలో మనమే సృష్టించిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం న్యాయ్ తెచ్చారని, ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6వేలు జీతం లెక్కన అందిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబం మాట తప్పే కుటుంబం కాదని, డబ్బు వారికి అవసరం లేదని, అవకాశం ఉన్నప్పటికీ పది సంవత్సరాలు రాహుల్ గాంధీ ప్రధాని పదవికి దూరంగా ఉన్నారని చెప్పారు. మాట ఇస్తే నెరవేర్చే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. నరేంద్రమోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందని, చింతలపూడి, ఇతర సిగ్మెంట్లు కూడా గెలుస్తామని ప్రచారంలో కాంగ్రెస్‌కు లభించిన ప్రజాదరణ రుజువు చేస్తోందన్నారు. హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. రెట్టించిన కార్యకర్తల ఉత్సాహం మధ్య సాయంత్రం పాత బస్టాండ్ వద్ద ప్రచారానికి కాంగ్రెస్ నేతల తెరదించారు. ఈ రోడ్‌షోలో చింతలపూడి కాంగ్రెస్ అభ్యర్థి మారుమూడి థామస్, పీసీసీ కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, పీసీసీ సంయుక్త కార్యదర్శి మద్దాల ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు జెట్టి ఆదిత్య, ఉక్కుర్తి దుర్గారావు, ఓరుగంటి నాగేంద్ర, కుక్కల ధర్మరాజు, మల్లిపూడి రవికుమార్, గగ్గల కిరణ్‌కుమార్, మోగిలినీడి శ్యామ్, కొల్లి రామసూరి, వసంతాటి మంగరాజు, కొత్తూరి చిన్న తదితరులు పాల్గొన్నారు. కాగా, కొయ్యలగూడెంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు.