పశ్చిమగోదావరి

జగన్‌కు ఓటేస్తే దైవాగ్రహానికి గురికాక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, ఏప్రిల్ 9: క్రైస్తవ నిబంధనలకు విరుధంగా విగ్రహారాధన చేసిన వైసీపీ అధ్యక్షులు జగన్మోనరెడ్డికి ప్రజలు ఓట్లేస్తే దైవాగ్రహానికి గురికాక తప్పదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. మంగళవారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహనరెడ్డి ఓట్ల కోసం విగ్రహారాధన చేసారని పేర్కొంటూ వీడియో క్లిప్పింగులు చూపారు. అనంతరం పాల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమన్నారు. నరసాపురం నియోజకవర్గ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న తాను గెలిచిన తరువాత అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తానన్నారు. ఎంపీగా ఎన్నికయ్యాక నరసాపురం నియోజకవర్గాన్ని నార్త్ అమెరికాలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

భీమవరంలో జనసైన్యం కవాతు
భీమవరం, ఏప్రిల్ 9: ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో భీమవరంలోని జనసైన్యం పెద్దఎత్తున మంగళవారం కవాతు నిర్వహించింది. స్ధానిక ఆర్టీసీ డిపో వద్ద నుంచి పవన్ నిర్వహించిన ఎన్నికల సభ వరకు ఈ కవాతు సాగింది. జాతీయ పతాకాలు, జనసేన పార్టీ జెండాలతో యువత పెద్ద ఎత్తున ఈ కవాతులో పాల్గొన్నారు. స్థానిక పోలీసు బొమ్మ సెంటర్‌లో పవన్ బహిరంగ సభా వేదిక పైకి వెళ్లిన వరుణ్‌తేజ్ అక్కడకు వచ్చిన బాబాయ్‌ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సంఘటన జనసైన్యానికి ఎంతో ఆనందం కలిగించింది. సభ అనంతరం భీమవరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగేంద్రబాబు ఇద్దరూ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.