పశ్చిమగోదావరి

ముఖ్యమంత్రి దృష్టికి వేసవి సెలవుల అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 6: అంగన్‌వాడీ ఉద్యోగులకు వేసవి సెలవుల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని రాష్ట్ర గనులు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత హామీయిచ్చారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అంగన్‌వాడీ, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులు, తెలుగు మహిళా అధ్యక్షురాళ్లు మంత్రిని కలిసి అంగన్‌వాడీ ఉద్యోగులకు నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతోత్వరలో ఆరువేల అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు
తెలిపారు. గత రెండేళ్లలో తొమ్మిది వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగాలను భర్తీ చేసామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామని త్వరలోనే అంగన్‌వాడీలో చదివే చిన్నారులకు మెరుగైన సౌకర్యాలతోపాటు యూనిఫారం కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మేఘలాదేవి, కార్యదర్శి నట్టా కుమారి, గుంటూరు జిల్లా అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీకాంతం, కృష్ణాజిల్లా అంగన్‌వాడీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కన్వీనర్ కొడాలి హేమలత పాల్గొన్నారు.