పశ్చిమగోదావరి

16 నుండి చిన్నవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 8: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వైభవాన్ని చాటే వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు చిన్న తిరుపతి క్షేత్రంలో ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. వీటిని పురస్కరించుకుని ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. విఐపిలు, వివిఐపిలు, ఇతర ప్రముఖులను ఈ ఆహ్వాన పత్రికల ద్వారా బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ఆహ్వానించనున్నారు. అలాగే ఈ ఉత్సవాలను కన్నుల పండువుగా జరిపించేందుకు దేవస్థానం ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుండి మొదలయ్యే దుర్ముఖి నామ సంవత్సర వైశాఖ తిరుకల్యాణ మహోత్సవాలు 23వ తేదీ వరకు ఆలయంలో వైభవోపేతంగా జరుగనున్నాయి. ఉత్సవ రోజుల్లో ఉభయ దేవేరులతో స్వామి వారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖమండపంలో రోజుకో ప్రత్యేక అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు బ్రహ్మోత్సవాల వివరాలను ఆదివారం స్థానిక విలేఖరులకు వివరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేస్తారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుండి గజవాహనంపై శ్రీవారి తిరువీధి సేవ జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి అంకురార్పణ, ధ్వజారోహణ, రాత్రి 8 గంటల నుండి హంసవాహనంపై గ్రామోత్సవం, ఈ నెల 18న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ జరుగుతుంది. ఈ నెల 19వ తేదీ రాత్రి ఎదుర్కోలు ఉత్సవం, ఈ నెల 20వ తేదీన ఉదయం 7 గంటల నుండి సింహవాహనంపై శ్రీవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుండి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. 21వ తేదీన రథోత్సవం, 22న చక్రవార్యోత్సవం, 23న రాత్రి జరగనున్న శ్రీపుష్ప యాగోత్సవంతో బ్రహోత్సవాలు ముగుస్తాయని ఇఒ త్రినాథరావు వివరించారు.