పశ్చిమగోదావరి

సొంత ఇళ్లు లేని వారిని గుర్తించడానికి సర్వేనాలుగు మున్సిపాల్టీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 12 : జిల్లాలో తణుకు, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం పట్టణాలతోపాటు జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో స్వంత ఇల్లు లేని లబ్ధిదారులను గుర్తించేందుకు డిమాండ్ సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరు ఛాంబరులో గురువారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో పట్టణ గృహ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్‌ఇడి బల్బుల అమరిక, స్వచ్ఛ్భారత్, తడిపొడి చెత్త సేకరణ, పన్ను వసూళ్లు, తదితర అంశాలపై కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో నివసిస్తున్న నిరుపేదలందరికీ ఇళ్లు అందించాలనే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో 24 వేల ఇళ్లు నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా జిల్లాలో మిగిలిన తణుకు, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం పట్టణాలతోపాటు జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెండురోజుల్లో డిమాండ్ సర్వే నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టరు ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత మున్సిపల్ ఛైర్‌పర్సన్ల దృష్టికి కూడా తీసుకువెళ్లాలని కలెక్టర్ ఈ సందర్భంగా కమిషనర్లను ఆదేశించారు. ఏలూరు నగరం సహా మిగిలిన మున్సిపాల్టీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయని కలెక్టరు అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే వారం నాటికి పూర్తిస్థాయిల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెంలో ఎల్‌ఇడి బల్బుల అమరికలో మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. జంగారెడ్డిగూడెంలో వచ్చే వారం నాటికి కనీసం వంద పోల్స్ ఏర్పాటు చేయకపోతే తగుచర్యలు తీసుకుంటామన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో కూడా ప్రగతి సాధించాలన్నారు. సమావేశంలో జిలాల గృహ నిర్మాణ సంస్థ పిడి శ్రీనివాసరావు, ఏలూరు కమిషనర్ వై సాయి శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్లు పి నిరంజన్‌రెడ్డి, అమరయ్య, డి నాగేంద్రకుమార్, సాల్మన్‌రాజు, సత్యనారాయణ, కృష్ణమోహన్ పాల్గొన్నారు.