పశ్చిమగోదావరి

ఇతర శాఖల వారిని నియమించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 13 : మున్సిపల్ కమిషనర్లుగా ఇతర ప్రభుత్వ శాఖల నుండి డిప్యుటేషన్‌పై నియమించవద్దని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఏలూరు కార్పొరేషన్ కమిషనరు యర్రా సాయి శ్రీకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలో శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డి నారాయణను కలుసుకుని వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇతర శాఖల అధికారులను డిప్యుటేషన్‌పై మున్సిపల్ కమిషనర్లుగా నియమించడం వలన మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్లలో తీవ్ర నష్టం జరుగుతోందని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఉన్న వారిని మాతృశాఖకు పంపించాలని వినతిపత్రంలో కోరినట్లు ఆయన చెప్పారు. మున్సిపల్ పరిపాలనా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా గత ఆరు నెలల కాలంలో ఇతర శాఖల నుండి అయిదుగురును కమిషనర్లుగా నియమించారని పరిపాలనలో నైపుణ్యం లేని కారణంగా ఆయా పురపాలక సంఘాలలో పరిపాలనాపరమైన సమస్యలుత్పన్నం అవుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2005లో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని దాని ప్రకారం పురపాలక శాఖలో డిప్యుటేషన్లు రద్దుచేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయని హైకోర్టులో కూడా 2014లో ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ దావా వేసిందని, అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నందున డిప్యుటేషన్‌పై ఇతర శాఖల అధికారులుగా నియమించవద్దని, ఉన్న వారిని తిరిగి మాతృసంస్థకు పంపించాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శ్రీకాంత్ వివరించారు.