పశ్చిమగోదావరి

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 16: శ్రీవారు పెండ్లి కుమారుడిగాను, అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగాను ముస్తాబు చేయడంతో శ్రీవారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్న తిరుపతిలో ఆలయ అర్చకులు, పండితులు ఈ తంతును వేద మంత్రోచ్ఛరణల నడుమ నేత్రపర్వంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిధ్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత ఆలయ ప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపంపై శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకారణ చేశారు. అంతకు ముందే వేదికను, పరిసరాలను సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడితోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. వేదికపై ఏర్పాటుచేసిన రజిత సింహాసనంపై ఉంచిన స్వామి, అమ్మవార్ల మూర్తులకు కల్యాణ తిలకం, బుగ్గన చుక్కదిద్ది తంతును ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గ్రామాలన్నీ అభివృద్ధి చెందాల్సిందే
నియోజకవర్గంలోని అధికార్లకు విప్ చింతమనేని ఆదేశం
దెందులూరు, మే 16 : నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాలన్నీ కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, ప్రగతి సాధించాల్సిందేనని ప్రజలకు చేరువలో మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం దెందులూరు మండల తహశీల్దార్ కార్యాలయం నుంచి పెదపాడు, పెదవేగి మండలాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా మండలాల్లో జరుగుతున్న ప్రగతి పనులపై ఆరా తీశారు. ఉపాధి పనులు ముమ్మరం చేయాలని, ప్రస్తుతం కంటే రోజురోజుకూ పనిదినాల సంఖ్య పెరగాలని సూచించారు. ఇంకుడుగుంతలు నిర్మాణాలు ముమ్మరం చేయాలని, పొలం పాట్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఉపాధి కూలీలకు మజ్జిగను నిరంతరం సక్రమంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి, మంచినీటి సౌకర్యాలు, మీకోసంలో వచ్చిన వినతులు తదితర సమస్యలపై సమగ్ర ఆరా తీశారు. వాటి ప్రగతిపై వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట దెందులూరు ఎంపిపి పప్పల సుశీల, జడ్పీటిసి ముమ్మిడి సక్కుకుమారి, మండల తహశీల్దార్ ఎండి నజీముల్లాషా, ఎంపిడివో ఎంవి అప్పారావు, ఇవో ఆర్‌డి కె రామ్మోహనరావు, ఎన్ ఆర్ ఇజి ఎస్ ఎపివో పి కిషోర్‌కుమార్, ఆర్‌డబ్ల్యు ఎస్ డి ఇ రామారావు, హౌసింగ్ డి ఇ ఉప్పలపాటి సోమేశ్వరరావు, ఎ ఇ సత్యవరప్రసాద్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. టిడిపి నాయకులు జనార్ధనరావు, ఇప్పిలి వెంకటేశ్వరరావు తదితరులున్నారు.