పశ్చిమగోదావరి

సమన్వయంతో ప్రజల వద్దకు పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పధకాలను ప్రజలవద్దకు చేర్చేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ కోరారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో వివిధ పధకాల అమలుతీరుపై ఆయన సమీక్షించారు. పేదప్రజల ఆర్ధికజీవనస్ధితిగతులు మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అనేక నూతన పధకాలను చేపట్టాయని, వాటి ఫలాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2016-17 ఆర్ధిక సంవత్సరానికి వివిధ పధకాల కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, జూన్ నాటికల్లా వివిధ పధకాల కింద లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జూలై నుండి యూనిట్లు స్ధాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నిచోట్ల బ్యాంకులు లబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీ సొమ్మును డిపాజిట్ రూపంలో స్వీకరించి రుణాలు మంజూరు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది మంచిపద్దతి కాదని ఆయన హితవు పలికారు. జిల్లాలో మూడులక్షల ఎల్‌ఇసి కార్డులను ఈ ఏడాది కౌలురైతులకు అందించి పంటరుణాలను పెద్దఎత్తున అందించాలన్నారు. అపరాల సాగును మెట్టప్రాంతంలో పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీ, కాపులకు రుణాలు అందించటంలో ముందుగానే లబ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం కింద జిల్లాస్ధాయిలో ఇంకా ఎనిమిది సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మరింత మెరుగుపర్చాలన్నారు. కొన్నిశాఖల్లో ఉద్యోగులు పర్యటనల పేరుతో అసలు హాజరువేయటం లేదని, ఎక్కడ పర్యటనకు వెళ్లినా అయా మండల కార్యాలయాల్లో విధిగా బయోమెట్రిక్ హాజరు వేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, డిఆర్వో కె ప్రభాకరరావు, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, జడ్పీ సిఇఓ సత్యనారాయణ, అర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణ, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటరమణ, డిపిఓ ఆర్‌వి సూర్యనారాయణ, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.