పశ్చిమగోదావరి

దిద్దుబాటలో అమృత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 17: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ పథకానికి సంబంధించి సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లోని లోపాలను సరిదిద్దడానికి ఎయికామ్ కన్సల్టెన్సీ రంగంలోకి దిగింది. సంజయ్‌శర్మ ఆధ్వర్యంలోని విజయశర్మ, మెహర్ బృందం మంగళవారం భీమవరం కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావును కలిసింది. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలను అమృత్ పథకానికి ఎంపికచేశారు. ఈ పథకానికి సంబంధించి ప్రాథమిక అంచనాలతో డిపిఆర్‌లను ప్రభుత్వానికి పంపించారు. అయతే డిపిఆర్‌లు పొందుపర్చిన కొన్ని పనుల్లో అంచనాలకు మించి ఎస్టిమేట్లు వేయడం, అవసరమైన పనులకు నిధులు తక్కువగా కేటాయించడం వంటి చిన్న చిన్న లోపాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రాథమికంగానే పథకంలో అవినీతి చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను, వేగవంతంగా పనులు జరిగేందుకు తదితర అంశాలను పరిశీలన చేసే బాధ్యతను ప్రభుత్వం ఎయకామ్ సంస్థకు అప్పగించింది. ప్రభుత్వం జిల్లాలోని అత్యధిక ప్రాధ్యానత కలిగిన పట్టణంగా భీమవరం ఉండటంతో ముందుగా ఎయకామ్ బృందం ఇక్కడకు వచ్చింది. ఇంజనీరింగ్ విభాగంలోని అధికారులతో కమిషనర్, ఈ బృందం రాత్రి వరకు చర్చలు జరిపారు. 2015-16 అమృత్ స్కీమ్ డిపిఆర్‌పై సమీక్షించారు. అందులోని లోపాలను సరిచేయాలని బృందం సూచించింది. అలాగే కొద్దిరోజుల్లో విజయవాడలో అమృత్ స్కీమ్‌పై రాష్టవ్య్రాప్తంగా అన్ని పురపాలక సంఘాలతో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో 2016-17కు సంబంధించిన డిపిఆర్‌పై ఇంజనీరింగ్ అధికారులతో ఈ బృందం చర్చించింది. ప్రజల నీటి అవసరాలు తీర్చడానికి రూపొందించిన పైపులైన్ విస్తరణ పనులు, డ్రెయినేజీ వ్యవస్థ, స్లూరుూజ్ ట్రీట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌టిపి)లపై ప్రత్యేకంగా చర్చించారు. బృందం ఇంజనీరింగ్ విభాగాన్ని అనేక కోణాల్లో ప్రశ్నించింది. ప్రతీ ప్రశ్నకు కూడా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారుల బృందానికి సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావును బృందం కలిసింది.