పశ్చిమగోదావరి

ఈదురు గాలులకు తెగిన విద్యుత్ తీగలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, మే 19 : వర్షానికి విదుత్ తీగలు తెగి విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతిచెందారు. పెదవేగి మండలం నాగన్నగూడెంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం నాగన్నగూడెం గ్రామానికి చెందిన గురిందపల్లి ఏసు (50) ఇంటి మీదుగా ఉన్న విద్యుత్ తీగలు బుధవారం రాత్రి కురిసిన గాలివానకు తెగి, ఇంటి ముందు పడ్డాయి. దీన్ని గమనించని ఏసు తెగిన తీగలపై కాలు వేశాడు. వెంటనే విద్యుత్ షాక్‌తో పెద్దగా కేకలు వేస్తూ పడిపోయాడు. భర్తకు ఏమైందోనని ఇంట్లో వున్న భార్య రాహేలు (47) బయటకు వచ్చి, భర్తను పట్టుకుంది. దీనితో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై స్థానికులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించారు. ఏసు, రాహేలమ్మలకు వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు జయరాజు ఇంటర్ చదువుతున్నాడు. కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం తెల్లవారుజామునే హుటాహుటిన నాగన్నగూడెం చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్‌కో నుంచి ఇద్దరికీ నాలుగు లక్షల రూపాయల పరిహారం అందుతుందని, కుమారుడు జయరాజు ఇంటర్ చదువుతున్నాడు కాబట్టి ఐటిఐ చదివితే ట్రాన్స్‌కోలో ఉద్యోగం వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.