పశ్చిమగోదావరి

ఆకివీడు అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, మే 19: రోను తుపాను బీభత్సంతో ఆకివీడు మండలం అతలాకుతలమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలోని కోళ్ళపర్రు, సిద్దాపురం, చినకాపవరం, పెదకాపవరం, కుప్పనపూడి గ్రామాల్లో వర్షపునీరు రోడ్లపైకి చేరింది. రహదారులు ఛిద్రమయ్యాయి. జనజీవనం స్తంభించింది. గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఆకివీడులో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కార్యదర్శి ఠాగూర్ హుటాహుటిన మంచినీటి సరఫరా ప్రాంతానికి వెళ్ళి జనరేటర్ల ద్వారా మంచినీటి ట్యాంక్‌లు నింపే ప్రయత్నం చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం ఆకివీడు ప్రజలకు నీటి సరఫరా అయ్యింది. అలాగే పలు వార్డుల్లో నిలిచిపోయిన వర్షపునీటిని పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగుబోదెల్లోకి నీరు పారుదల జరిగేలా చర్యలు చేపట్టారు.