పశ్చిమగోదావరి

నేరాలను పూర్తిగా అదుపుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 22: నేరాల నియంత్రణలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమాజంలో నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణను కోరారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి మంత్రి సుజాతను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితులపై డిఐజి రామకృష్ణ, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లతో మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయని, ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల నుండి ఎక్కువగా బాలికల అక్రమ రవాణాను నిరోధించాలని మంత్రి చెప్పారు. నేర నియంత్రణకు ఆధార్ అనుసంధానం కూడా ఎంతో ఉపయోగపడుతుందని, నేరాలు జరిగిన ప్రాంతాలలో వేలిముద్రలు సేకరించి వాటిని ఆధునిక పరిజ్ఞానంతో ఆధార్ అనుసంధానం చేస్తే నేరగాళ్లను ఇట్టే పట్టేయవచ్చునని మంత్రి చెప్పారు. ఏలూరు రేంజ్ డి ఐజి రామకృష్ణ మాట్లాడుతూ ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు తనకు కొత్త కాదని, ఇటీవల పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జంగారెడ్డిగూడెం, పోలవరం తదితర ప్రాంతాలలో పర్యటించానని, ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్‌గా అందరితో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఏలూరు రేంజ్ డి ఐజిగా బాధ్యతలు చేపట్టి కొద్దికాలమే కావడంతో శాంతిభద్రతలు, ఇతర విషయాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నామన్నారు. ఏలూరు రేంజ్‌లో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ప్రజా సహకారాన్ని కూడా తీసుకుంటామని చెప్పారు. బాలికల అక్రమ రవాణా, వైట్ కాలర్ నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ఏలూరు రేంజ్ పరిధిలో మంచి పోలీసు వ్యవస్థను రూపొందిస్తామని ఈ విషయంలో అందరి సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు.