పశ్చిమగోదావరి

టెన్త్ పరీక్షలకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 2 : పరీక్షా కాలం వచ్చేస్తోంది. ఇక కొద్దిరోజులే మిగిలింది. పాఠశాల విద్యలో అత్యంత కీలకంగా నిలిచే పదవ తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ఇక 80 రోజులే మిగిలి ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా విద్యాశాఖ ఈ సారి రాష్ట్రంలోనే పదవ తరగతి ఫలితాల్లో ప్రధమస్థానం సాధించే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా కమిట్‌మెంట్ అన్న కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. వినూత్నంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా పెంచడంతోపాటు ఉత్తమ విద్యార్ధుల్లో అధిక శాతం మంది 10 జిపి ఎ సాధించే దిశగా లక్ష్యాలను నిర్ధేశించుకుంది. జిల్లా విద్యాశాఖాధికారి డి మధుసూధనరావు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని పది వారాల కాల పరిమితితో ముందుకు తీసుకువెళుతున్నారు. ఏది ఏమైనా జిల్లా విద్యాశాఖ పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు సమాయత్తమవుతోందని డి ఇవో మధుసూధనరావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ కమిట్‌మెంట్ వివరాలను తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 30 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఇటీవలే క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలను భేరీజు వేసుకుంటూ ఎంత మంది విద్యార్ధులు ఏ స్థాయిలో వున్నారన్న అంశాన్ని నిర్ధారించుకున్నారు. దీనిలో ఉత్తమ విద్యార్ధులను గుర్తించడంతోపాటు కొద్దిగా కష్టపడితే ఉత్తీర్ణత సాధించగలిగే విద్యార్ధుల సంఖ్యను కూడా తేల్చారు. ఈ గణాంకాలతో నాలుగు విభాగాలుగా విద్యార్ధులను గుర్తించారు. పశ్చిమ ఆణిముత్యాలు విభాగంలో 2104 మంది, పశ్చిమ వజ్రాలు విభాగంలో 10330 మంది, పశ్చిమ బంగారు విభాగంలో 13887, పశ్చిమ ఆశాజ్యోతి విభాగంలో 5114 మంది విద్యార్ధులు వున్నట్లుగా గుర్తించారు. దీనిలో ఆశాజ్యోతుల విభాగంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీరు కొద్దిగా కష్టపడితే ఉత్తీర్ణత సాధించే అవకాశం వుంటుందని గుర్తించి వీరిని చదువులో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టారు. అదే విధంగా ఆణిముత్యాలు విభాగంలో వున్న ఉత్తమ విద్యార్ధులు మరికొద్దిగా కష్టపడితే 10 జిపి ఎ సాధించే అవకాశాలు భారీగా మెరుగుపడతాయని కూడా గుర్తించారు. ఆ విధంగా ఈ నాలుగు విభాగాలను పరిగణనలోకి తీసుకుంటూ విద్యాశాఖ నూతనంగా కమిట్‌మెంట్ (కరిక్యులం ఆర్గనైజేషన్ మెథడ్ మోడిఫికేషన్ ఇన్ టెన్త్ క్లాస్ మెయిన్ ఎగ్జామ్ బై ఎంకరేజింగ్ నాచురల్ టాలెంట్స్) కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీనిలో పది వారాల పాటు ఈ కార్యక్రమం అమలు కానుండగా అన్ని సబ్జెక్టులను, అన్ని చాప్టర్లను విద్యార్ధులతో ఈ పది వారాల్లో చదివించి వారిని పదవ తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయనున్నారు. దీన్ని అమలు చేసేందుకు వినూత్నంగా అష్టాంగ మార్గాలను వినియోగించనున్నారు. గతానికి భిన్నంగా ఉపాధ్యాయులను కూడా చైతన్యపరుస్తూ విద్యార్ధులను పరీక్షలకు సంసిద్ధులయ్యేలా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పదవ తరగతి ఉపాధ్యాయులు విద్యార్ధులను దత్తత తీసుకోవడాన్ని అమలు చేస్తారు. అంటే ఆ విద్యార్ధులు పదవ తరగతిలో ప్రతిభ చూపడంలో ఈ ఉపాధ్యాయుల బాధ్యత ఎక్కువగా వుంటుంది. అలాగే గృహాల సందర్శన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. దీనిలో పదవ తరగతి ఉపాధ్యాయులు తమ పరిధిలో వున్న పదవ తరగతి విద్యార్ధుల ఇళ్లను సందర్శించి వారు చదువుతున్నదీ? లేనిదీ? పరిశీలిస్తారు. అలాగే వారి ఇళ్లలో విద్యార్ధుల చదువుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నదీ? లేనిదీ? కూడా చూస్తారు. ఈ విధంగా సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు, తెల్లవారుఝాము 4.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ గృహాల సందర్శన కార్యక్రమం జరుగుతుంది. అలాగే గతానికి భిన్నంగా ఈసారి హామీ పత్రాలను తీసుకునే విధానాన్ని డి ఇవో ప్రవేశపెడుతున్నారు. అంటే తమ పరిధిలోని విద్యార్ధులు తమ సబ్జెక్టులో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని సంబంధిత ఉపాధ్యాయుల నుంచి హామీ పత్రాలను తీసుకుంటారు. ఉపాధ్యాయులంతా ఈ పత్రాలను ప్రధానోపాధ్యాయులకు, స్కూళ్ల హెచ్ ఎంలంతా సంబంధిత డివై ఇవోకు, డివై ఇవోలు అదే విధంగా తమ పరిధిలో పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధిస్తామన్న హామీ పత్రాలను డి ఇవోకు అందజేస్తారు. దీనితోపాటు ప్రత్యేక తరగతులు, గ్రూప్ స్టడీ, మార్గదర్శక బృందాల పరిశీలన, బడిలో బస వంటి కార్యక్రమాలు కూడా అమలు చేయనున్నారు. మొత్తం మీద ఈసారి పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది.
8న మళ్లీ సిఎం రాక
ఏలూరు, జనవరి 2 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన మరోసారి జిల్లాకు రానున్నారు. జనవరి 1వ తేదీన ఏలూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈసారి జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఏ ప్రాంతంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారోనన్న అంశంపై స్పష్టత రావాల్సి వుంది. 8వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన అనంతరం మధ్యాహ్నం జిల్లాలో సి ఎం పర్యటన వుంటుందని ప్రాధమికంగా నిర్దారణ అయ్యింది.