పశ్చిమగోదావరి

రాత్రికి రాత్రే అన్నీ జరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 26: ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతాపార్టీ స్వీకరిస్తోంది. విభజన చట్టంలో ఉన్న అంశాలను అవసరమైతే సవరణ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. అయినా రాత్రికి రాత్రే అన్నీ జరగవు...’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు విరుచుకుపడ్డారు. పోలవరం బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు తెలుగు ప్రజలకు జీవన రేఖ వంటిదని అభివర్ణించారు. తెలంగాణలో ఉన్న ముంపు మండలాలను ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండవ ఆర్డినెన్స్‌గా ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని గుర్తుచేశారు. గురువారం ఎంపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ గోకరాజు గంగరాజు మాట్లాడారు. రెండవ ఆర్డినెన్స్‌లో మండలాలను ఎపిలో విలీనం చేయడం జరిగిందంటే ప్రధానికి ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా తెలుగు ప్రజలంటే ఎంత అభిమానముందో అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల విషయంలో అనేక అభ్యంతరాలున్నాయని, వాటిని ప్రధాని మోదీ పరిష్కరించేందుకు కృషిచేస్తున్నారన్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, జూన్ 15వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో మోదీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సభలు కూడా ఏర్పాటుచేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ తదితర ప్రాంతాల్లో ఈ సభలు ఏర్పాటుచేశామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా భారీ సభను ఏర్పాటుచేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కోరామన్నారు. ప్రతీ పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్తామని, వారికి లబ్ధి చేకూరేలా చేయడమే లక్ష్యమన్నారు. జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన రెండేళ్ల అభివృద్ధి పథకాలను పెద్దఎత్తున ఉత్సవాలు, సంబరాల రూపంలో జరుపుతున్నామన్నారు. రాజకీయ అవినీతికి ఫుల్‌స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీయేనని వర్మ అన్నారు. ఇప్పటివరకు 40 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. కాంగ్రెస్, సిపిఎంలు అవగాహన లేమితో మాట్లాడుతున్నాయని వర్మ వ్యాఖ్యానించారు. వికాస్ పర్వ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ విభజన చట్టంలోని పనులను కూడా బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు చేస్తుందన్నారు. నిరంతర విద్యుత్, రవాణా వ్యవస్థ, సోలార్ వంటి పథకాలు ఏపిలో విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. మిత్రపక్షం బిజెపిని దోషిగా చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.