పశ్చిమగోదావరి

కళ్లు తేలేస్తున్న కోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 26: భానుడు ప్రతాపానికి పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు. పరిశ్రమలోని బాయిలర్ కోళ్లు రోజుకు వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వాటిని సంరక్షించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ క్రమంలో పలు పౌల్ట్రీ పరిశ్రమలోని కోళ్లు నిత్యం వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. దీంతో కోళ్ల రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలోని దొరసానిపాడు, రామన్నగూడెం, గుండుగొలనుగుంట, జాజులకుంట, మలసానికుంట తదితర గ్రామాల్లో ఎక్కువగా రైతులు బాయిలర్ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే వీరంతా పౌల్ట్రీలోని కోళ్లను రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈక్రమంలో కోళ్ల షెడ్లపై కొబ్బరి మట్టలు వేసి, ఎప్పుడూ తడుస్తూ చల్లని వాతావరణం కలిగేలా స్ప్రింక్లర్లను ఏర్పాటుచేశారు. అలాగే షెడ్లలో ఫ్యాన్లను, కోళ్లు తాగే నీరు వేడెక్కకుండా ట్యాంకులకు గట్టితాళ్లను చుట్టి మరీ పెంచుతున్నారు. అయినా భానుడి భగభగల ముందు అవి నిలవడం లేదు. ఒక్కో పరిశ్రమలో ఒక్కో రోజు వంద నుండి రెండు వందల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రతి వేసవిలో ఈ పరిశ్రమల ద్వారా తాము నష్టాలను చవిచూస్తున్నామని పలువురు కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు తగ్గకుండా మున్ముందు పరిస్థితి ఇలానే ఉంటే తాము ఈ పరిశ్రమలు నడపలేమని అంటున్నారు.