పశ్చిమగోదావరి

సంక్షేమ పథకాల అమలుకు చిత్తశుద్ధితో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 2 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఏలూరు ఎంపి మాగంటి బాబు సూచించారు. జన్మభూమి- మా ఊరు 3వ విడత కార్యక్రమాన్ని శనివారం ఏలూరు మండలంలో ప్రారంభించారు. తొలిరోజు మండలంలోని చొదిమెళ్ల, తంగెళ్లమూడి, శనివారపుపేట, సత్రంపాడు గ్రామాలలో నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందేశాన్ని ఏలూరు ఎండివో ప్రకాశరావు చదివి వినిపించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను దీపం పధకాలను అర్హులైన వారికి గ్యాస్ కనక్షన్లను, ఎన్‌టి ఆర్ ట్రస్టు ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం నిమిత్తం నిధులను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏలూరు ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పధకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఎన్నికల హామీలను విడతల వారీగా అమలు చేస్తుందన్నారు. గడచిన వేసవిలో ప్రజలకు నీరు, విద్యుత్తును సమృద్ధిగా అందజేసామన్నారు. అధికారులు ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం అన్ని నెరవేరుస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన వుందన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి తనను నేరుగా కలవవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపిపి రెడ్డి అనురాధ, జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, సర్పంచ్‌లు తాళం ప్రమీళాదేవి, వెంట్రపాటి నాగేశ్వరమ్మ, కూరపాటి లూర్ధమ్మ, కొండే రాణి నిర్మలాదేవి, తహశీల్దార్ వి రామాంజనేయులు, మండల విద్యాశాఖాధికారి పివి రామశర్మ, మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ యు బాపిరాజులతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
తప్పులతడకగా రేషన్ కార్డులు
తాళ్లపూడి, జనవరి 2: ఎంతో అట్టహాసంగా రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకున్న ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్ కార్డులలో లబ్ధిదారుల వివరాలు తప్పుల తడకగా వచ్చాయి. పేర్లు, ఫొటోలు లేకుండానే రేషన్ కార్డులు విడుదల కావడం విశేషం. పేర్లు లేనివారికి మాత్రం వార్ని గుర్తించి అధికారులే స్వయంగా రాసి కొన్ని కార్డులను పంపిణీ చేయగా, ఫొటోలు లేనివాటికి మాత్రం కార్డు మంజూరైందన్న ఎండార్స్‌మెంట్‌ను అందజేశారు. కార్డులు వస్తున్నాయని ఎదురుచూసిన ప్రజలకు వేగేశ్వరపురంలో కొంత అసంతృప్తే మిగిలింది.