పశ్చిమగోదావరి

చేసిన సాయం చెబితే బాగుండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నవనిర్మాణ దీక్ష ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేశారో చెబితే బాగుండేదని బిజెపి రాష్ట్ర సమన్వయకర్త పురిఘెళ్ళ రఘురాం అన్నారు. మోదీ రాష్ట్రానికి చేసిన సహాయాన్ని ప్రస్తావించి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయి మరింత పెరిగేదన్నారు. అయినా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు తెలిసీ తెలియక విమర్శలు చేస్తున్నాయని ఘాటుగా స్పందించారు. గురువారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రధాని మోదీ ఇచ్చిన మాటను తప్పకుండా రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారని తెలిపారు. గత రెండేళ్ళల్లో 15,580 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి ఇచ్చారన్నారు. గతంలో తెలుగు ప్రజలు 15 నుంచి 20 గంటలు విద్యుత్ కోతలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అంతర్వేది డ్రెడ్జింగ్, పెట్రోలియం యూనివర్శిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన యూనివర్శిటీ, పొగాకు పరిశోధనా కేంద్రం, ఇటీవల కాలంలో ఈ-పోస్టల్ కేంద్రాలు, కోస్టల్ కారిడార్ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో చేశామన్నారు. ఇవేమీ తెలియక కొన్ని కొత్త ముఖాలను బిజెపి పదే పదే విమర్శించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించమన్నారు.
17న రాష్ట్రానికి అమిత్‌షా:మండల అధ్యక్షులతో భేటీ
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారని రఘురాం చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోని మండల అధ్యక్షులతో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అవుతారన్నారు. చేసిన ప్రతీ కార్యక్రమాన్ని ఆయన సమీక్ష చేస్తారని తెలిపారు. భారతదేశంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షులతో భేటీ కావడం ఇదే తొలిసారి అని రఘురాం చెప్పారు. సమీక్షలో పార్టీ బలోపేతం కోసం మండల అధ్యక్షుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని తదుపరి పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడానికి ఆదేశాలిస్తామన్నారు. వికాస్ పర్వ్‌లో భాగంగా బిజెపి రెండేళ్ల పాలనపై చేసిన అభివృద్ధిని వివరించేందుకు ఈ నెల 4, 5 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడలలో సభలు ఏర్పాటుచేసినట్టు రఘురాం తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి, ఐటి శాఖ మంత్రి ఈ సభల్లో పాల్గొంటారన్నారు. భారతీయ జనతాపార్టీ చేస్తున్న అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జెడ్‌ఆర్‌యుసిసి సభ్యులు వేగేశ్న మూర్తిరాజు, యువమోర్చా రాష్ట్ర నాయకుడు గోకవరపు శ్రీనివాస్ తెలిపారు. ప్రధాని చెప్పినట్టు అంబేద్కర్ కొందరివాడు కాదని, అందరి వాడనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఎస్సీ మోర్చా నాయకుడు బూసి సురేంద్రనాథ్ బెనర్జీ చెప్పారు.