పశ్చిమగోదావరి

‘పోలవరం’ పరిశీలించిన సిడబ్ల్యుసి డైరెక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెరుగుతున్న అంచనాలు, సమస్యలు తెలుసుకోవడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆదేశాల మేరకు వచ్చినట్టు సిడబ్ల్యుసి డైరెక్టర్లు వీరేంద్రశర్మ, ప్రమోద్ నారాయణలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వచ్చిన డైరెక్టర్లు కాంట్రాక్టు ఏజెన్సీ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, కుడి కాలువ, ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు విషయాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధి సత్యంబాబు వివరించారు. ఈ సందర్భంగా సత్యంబాబు సిడబ్ల్యుసి డైరెక్టర్లతో మాట్లాడుతూ 2013 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. అయితే భూసేకరణ, నిర్వాసితుల సమస్యల పరిష్కారం నిర్మాణ పనులు ముందుకు వెళ్లటంలేదన్నారు. అదీ కాకుండా డంపింగ్‌యార్డు కోసం 400 ఎకరాలు అవసరం కాగా, ప్రభుత్వం ఇప్పటివరకు చూపించలేదన్నారు. అప్పట్లో భూసేకరణ చేయని కారణంగా ప్రస్తుతం కొత్త భూసేకరణ చట్టం అమలుచేస్తుండటంతో భూసేకరణకు అంచనాలు పెరిగినట్టు తెలిపారు. వీరేంద్రశర్మ మాట్లాడుతూ అగ్రిమెంట్‌లో ఇపిసి సిస్టమ్ కాబట్టి భూసేకరణ పనులన్నీ మీరే చేసుకోవాలని, మాకు ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు వెళ్లాలని అన్నారు. అనంతరం స్పిల్‌వే నిర్మాణ పనులను, రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కుడి కాలువను పరిశీలించేందుకు తరలివెళ్లారు. వారి వెంట ప్రాజెక్టు ఎస్‌ఇ ఇఎస్ రమేష్‌బాబు, కుడి కాలువ ఎస్‌ఇ శ్రీనివాస్‌యాదవ్, ఇఇలు పుల్లారావు, రామచంద్రరావు, సిహెచ్ రామారావు తదితరులున్నారు.