పశ్చిమగోదావరి

టిడిపి ప్రజలను మోసం చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 9: టిడిపి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలుచేసి ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. కేవలం పదవుల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుంటామని ప్రకటించారు. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. గురువారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండి మండలం యండగండి గ్రామంలో మూడు పంటలు పండే సారవంతమైన 200 ఎకరాల ఆయకట్టు ఉందని, దీని మధ్యలో 30 ఎకరాల్లో కొంతమంది అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారన్నారు. దీనివల్ల పంట భూములు చౌడు తేలి పంటలు పండకుండాపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదుచేసినా స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్లు మధు విలేఖర్లకు చెప్పారు. పక్షం రోజుల్లో సిఎం స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధాన్యానికి ధర లేదన్నారు. కౌలురైతులకు పరపతి ఎక్కడ కల్పించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నెల 13నుండి పాఠశాలలు తెరవనున్నారని, పాఠ్యపుస్తకాలు ఇంకా సిద్ధంకాకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. వసతి గృహాలు మూసివేసి వాటి స్థానంలో పాఠశాలలు తెరవడం సరైన విధానం కాదన్నారు. దీనివల్ల వసతిగృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఎమ్మెల్యేలకు ప్రతీ నెల జీతాలు ఇస్తున్న ప్రభుత్వం చిన్న ఉద్యోగులకు జీతాలు ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. విలేఖర్ల సమావేశంలో ఆర్‌ఎస్ పాల్గొన్నారు.