పశ్చిమగోదావరి

విద్యా హబ్‌గా సిఆర్‌ఆర్ విద్యాసంస్థలు:ఎంపి మాగంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 16: ఏలూరులోని సర్ సిఆర్‌ఆర్ విద్యాసంస్ధలను విద్యాహబ్‌గా తీర్చిదిద్దడానికి కేంద్రప్రభుత్వం నుండి పలు వృత్తివిద్యాకోర్సులను, అవసరమైన నిధులను తీసుకువస్తామని ఎంపి మాగంటి బాబు తెలిపారు. స్ధానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో గురువారం సర్ సిఆర్‌ఆర్ విద్యాసంస్ధల పాలకవర్గం అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు ఎంపికి వినతిపత్రం సమర్పిస్తూ త్రిబుల్ ఐటి, సిఎ తదితర వృత్తివిద్యాకోర్సులను పేద విద్యార్ధినీవిద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావడానికి మానవవనరుల మంత్రిత్వశాఖ నుండి తగు అనుమతులు లభించేలా చూడాలని కోరారు. దీనిపై మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆంధ్రా యూనివర్శిటీ తర్వాత రెడ్డి విద్యాసంస్ధలకు మంచిపేరు ఉందని, రెడ్డి విద్యాసంస్ధలను ప్రత్యేక యూనివర్శిటీగా తీర్చిదిద్దేలా తనవంతు సహకారం అందిస్తానని, విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అమరావతి రాజధానికి దగ్గరలోనే రెడ్డి విద్యాసంస్ధలు ఉన్నందున కొత్త కోర్సులను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సిఆర్‌ఆర్ మెడికల్ కళాశాల స్ధాపన వైపు కూడా దృష్టి కేంద్రీకరిస్తే ఈప్రాంతంలోనే కొత్త వైద్యబృందాన్ని కూడా తీర్చిదిద్దగలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో దుర్గారావు, మాగంటి రాంజీ పాల్గొన్నారు.