పశ్చిమగోదావరి

పైడికొండల ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 16: తాడేపల్లిగూడెం కేంద్రంగా టిడిపి, బిజెపిల మధ్య చోటుచేసుకున్న బేధాభిప్రాయం గురువారంనాటి సిఎం పంచాయితీతో ప్రశాంతంగా ముగిసింది. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్ర అగ్రహం, అసహనంతో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అవసరమైతే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడిన నేపధ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. తనకు తెలియకుండా నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారంటూ ఛైర్మన్ తీరుపై మంత్రి మాణిక్యాలరావు టిడిపి అధిష్టానం వద్ద ఆగ్రహం వ్యక్తం చేయటం తెల్సిందే. ఈనేపధ్యంలోనే గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మాణిక్యాలరావు, జడ్పీ ఛైర్మన్ బాపిరాజులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా సంఘటనల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే తాడేపల్లిగూడెం పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి స్వయంగా నివేదికను కూడా తెప్పించుకున్నట్లు సమాచారం. వీటి ఆధారంగా జడ్పీ ఛైర్మన్ దూకుడు తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంచాయితీ సందర్భంగా పలు సందర్భాల్లో ఛైర్మన్ మాట్లాడేందుకు ప్రయత్నించినా దానికి ఇష్టపడని ముఖ్యమంత్రి అక్కడ ఏం జరుగుతోందో తనకు తెలుసునని, మంత్రి మాణిక్యాలరావు పెద్దమనిషి అని అయినా మిత్రధర్మాన్ని పాటించి ముందుకు సాగాలని ఇంతకుముందే పలుమార్లు చెప్పినా పదేపదే అ నియోజకవర్గం పరిధిలోనే ఇబ్బందులు రావటం ఏమిటని ఛైర్మన్‌ను నిలదీసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయన ఛైర్మన్‌పై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. చివరకు సమన్వయంతో ముందుకు సాగాలని, మరోసారి ఇలా జరిగితే సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తుందని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంమీద ఒక్కసారిగా పెల్లుబికిన ఆగ్రహం, అసహనం ముఖ్యమంత్రి చొరవతో సర్దుమణిగినట్లు కన్పిస్తోంది.