పశ్చిమగోదావరి

ఇసుక లారీలను అడ్డుకున్న రావూరిపాడు గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, జూన్ 17: ఇసుక రవాణా చేస్తున్న క్వారీ లారీలు తమ గ్రామం మీదుగా వెళ్లడాన్ని రావూరిపాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామం మీదుగా ఇసుక లారీలు అధిక సంఖ్యలో రావడాన్ని చూసి లారీ రవాణాకు అభ్యంతరం తెలిపారు. అధిక లోడు ఉన్న లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికితోడు ప్రధానంగా రహదారులు గోతులుపడి ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల రెండుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయని రావూరిపాడుకు చెందిన తొలిశెట్టి బాబ్జీ పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో తాము ఓట్లువేసేది లేదని వ్యతిరేకించిన సమయంలో తమకు ఈ రహదారి మంజూరైందని, ఈ రహదారిలో ఇప్పుడు లారీల ప్రయాణం వల్ల తమకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండడం వల్ల లారీల రాకపోకలను అంగీకరించేది లేదన్నారు.