పశ్చిమగోదావరి

బిజెపితోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 23: భారతీయ జనతా పార్టీ (బిజెపి)తోనే దేశంలోని యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో దేశ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంఒయులు చేసుకుంటున్నారన్నారు. అయితే తెలిసీ తెలియనివారు కేవలం విదేశీ పర్యటనలకే మోదీ పరిమితమవుతున్నారని విమర్శించడం తగదన్నారు. గురువారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నో ఉత్పత్తులను భారతదేశానికి దిగుమతి చేసుకునేవారని, మోదీ ప్రధాని అయిన తరువాత దేశానికి చెందిన ఉత్పత్తులే ఎగుమతులవుతున్నాయన్నారు. 2020నాటికి దేశంలోని అనేక ఉత్పత్తులను ఎగుమతిచేసే విధంగా ఒక పాలసీని బిజెపి తీసుకు రానున్నట్టు తెలిపారు. రెండున్నర లక్షల ఉద్యోగాలను ప్రకటించిన ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు. ఎన్నికల వాగ్దానాలను అమలుచేస్తున్న ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. 4వేల కిలోమీటర్ల సాగరమాల అభివృద్ధితో దేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. ముఖ్యంగా దేశంలోని ఫార్మశీ రంగం విచ్చలవిడిగా ధరలు పెంచుతూ వ్యవహరిస్తోందని, ఇటీవల ప్రధాని మోదీ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారని, వెంటనే మందు బిళ్లలపై 30 శాతం తగ్గించాలని కేంద్రం అనుమతులు జారీ చేసిందన్నారు. జనరిక్ మందుల ద్వారా అతి తక్కువ ధరలకు మందులు లభిస్తున్నాయన్నారు. యువతకు స్టాటప్, మేకిన్ ఇండియా, ముద్ర బ్యాంకు ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను పెద్దఎత్తున చేస్తున్నారన్నారు. ఏడాదికి రూ.1,800 కోట్లతో 1500 నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటుచేశారన్నారు. జడ్‌ఆర్‌యుసిసి సభ్యులు వేగేశ్న మూర్తిరాజు మాట్లాడుతూ భారత రైల్వేను సన్మార్గంలో పెట్టడానికి మోదీ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలోని డబ్లింగ్ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేసేందుకు ఎంపి గోకరాజు గంగరాజు సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, గోకవరపు శ్రీనివాస్, కోరం ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.