పశ్చిమగోదావరి

అన్నదాతలకు అండగా టిడిపి ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 27: అన్నదాతలకు అండగా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని రైతులకు రుణవిముక్తి పత్రాలను అందచేసిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. సోమవారంనాడు భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో రుణవిముక్తి పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఎంపిపి బండి సుజాత, జడ్పిటిసి బర్రె విజయ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అల్లూరి కృష్ణంరాజుల పాల్గొన్న ఈ సభలో ఎంపీ తోట సీతారామలక్ష్మీ ప్రసంగించారు. గ్రామంలోని రైతాంగమంతా కూడా ఒకేమాట పై నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లాపర్యటనకు వచ్చి రైతాంగానికి స్ఫూర్తినిచ్చేందుకు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. రైతులు పడుతున్న కష్టాలను గుర్తుంచుకున్న ముఖ్యమంత్రి అన్నిస్ధాయిల్లో వారిని ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. వ్యవసాయానికి యంత్రాలను, రైతాంగం నష్టపోకుండా భీమా సౌకర్యాన్ని కల్పించారన్నారు. గ్రామంలోని రైతులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పొంగుతున్న వాగులు
కుకునూరు, జూన్ 27: మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి చెరువులు నిండగా, వాగులు పొంగడంతో రహదారిపై ప్రయాణించే వారికి తీవ్ర ఆటంకమేర్పడింది. సంవత్సర కాలంలో గంటల తరబడి భారీ వర్షం పడడంతో దాసారం - కుకునూరు మధ్యలోగల గుండేటి వాగు పొంగి పొర్లడంతో లోలెవెల్ వంతెనను ఆనుకుని ఉన్న రహదారి పూర్తిగా కోతకు గురైంది. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. దాసారం, గొమ్మిగూడెం పంచాయతీ ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే ఈ వారధి దాటి రావలసి ఉంటుంది. ఈ భారీ వర్షానికి వాగు ఉగ్రరూపం దాల్చడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా..మండలంలో చివ్వాక, చీరవల్లి, అరవపల్లి, దాసారం గ్రామాల్లోని చెరువులు భారీ వర్షానికి పూర్తిగా నిండాయి. వరి కుంటలలో సైతం నీరు పొంగిపొర్లడంతో రైతులు దమ్ములకు సిద్ధమవుతున్నప్పటికీ వరినారు చేతికి అందక సాగులో లోటు కనిపిస్తోంది. ఇటీవల వేసిన పత్తిచేలో సైతం విత్తనం నుండి మొలకవచ్చినా వర్షాల కారణంగా అవికాస్తా కొట్టుకుపోవడంతో రైతులు కుదేలయ్యారు. రహదారులపై సైతం వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి.
నల్లజర్ల: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎర్ర కాలువ ఎగువన ఉన్న పులివాగు, కొండవాగులు పొంగి ఆ నీరు ఎర్ర కాలువలో కలుస్తుండటంతో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపల్లి వద్ద 1.5 మీటర్లు ప్రవహించింది. మంగళవారం కూడా ఇదే విధంగా వర్షం కురిస్తే వ్యవసాయ రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

భీమవరం మున్సిపాల్టీని
కార్పొరేషన్ స్థాయకి తీసుకెళ్లేందుకు

అందరూ సహకరించాలి
కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూన్ 27: భీమవరం మున్సిపాల్టీని కార్పొరేషన్ స్థాయికి తీసుకువెళ్దాం.. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘంలోని 39 వార్డులను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. చైర్మన్ కొటికలపూడి గోవిందరావుఅధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజులు హజరయ్యారు. ఎమ్మెల్సీ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా హజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడారు. బైపాస్ రోడ్డు సమస్య పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖతో కలిసి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రూ.75లక్షలను కేటాయించిందన్నారు. త్వరలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్‌లో ప్రతీ కౌన్సిలర్ భాగస్వామిగా ఉండి అర్హుల జాబితా సిద్దం చేయాలని ఆదేశించారు. వారందరికీ 82 ఎకరాల్లో ఇళ్ళను కేటాయిస్తామన్నారు. టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నిధులను తీసుకురావడానికి ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు తన వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అమృత్ భీమవరం పట్టణానికి వరం లాంటిదన్నారు. రానున్న రోజుల్లో భీమవరం మున్సిపాల్టీ కార్పొరేషన్ హంగులు సంతరించుకోనుందని, పట్టణం కూడా విస్తరించనుందని అటు ఉండి నుండి ఇటు శృంగవృక్షం వరకు విస్తరణ జరిగే అవకాశం లేకపోలేదన్నారు. పట్టణంలోని నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో గొల్లలకోడేరు గ్రామంలో సుమారు 100 ఎకరాల భూమిని సేకరించి పంపుల చెరువుతవ్వి టూటౌన్ ప్రజలకు త్రాగునీటిని అందిస్తామన్నారు. ప్రతీ వీధి ముందు, ప్రతీ ఇంటి ముందు మొక్క నాటాలని, అటువంటివారికి రూ.5లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి అవార్డు క్రింద ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. రాష్ట్రంలోనే భీమవరం మున్సిపాల్టీ ప్రధమస్ధానంలో ఉండాలన్నారు. ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మాట్లాడారు. మనం ఏం చేశామోనని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయాల్లో నిబద్దత, తపనతో పనిచేయాలన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ, వైకాపా కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావుసమాధానమిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమీషనర్ సిహెచ్. నాగనరసింహారావుకౌన్సిల్‌ను పరిచయం చేసుకున్నారు.
మూడు పిల్లలకు జన్మనిచ్చిన పునుగుపిల్లి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూన్ 27: తిరుమల అడవుల్లో సంచరించే పునుగుపిల్లులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కూడా సంచరిస్తున్నాయి. అయితే అవి ఎంతకాలం నుంచి ఉంటున్నాయో తెలియదుగానీ పట్టణంలోని శివారున ఉన్న బివిరాజు మున్సిపల్ పాఠశాలలో మూడు ఆడ పునుగు పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. దీన్ని ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు గమనించారు. గత కొంతకాలంగా పాఠశాలలోని ఫిజిక్స్ ల్యాబ్‌లో ఒక పునుగుపిల్లి సంచరిస్తూ ఉండేది. అయితే పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాక పునుగుపిల్లి సంచారం కనిపించలేదు. అయితే సోమవారం పిల్లుల శబ్దం రావడంతో ఉపాధ్యాయులు ఫిజిక్‌ల్యాబ్‌లోకి వెళ్ళి చూసేసరికి పునుగుపిల్లి మూడు పిల్లలకు జన్మనివ్వడం కనిపించింది. అయితే అవి ఎవరికి హాని కలిగించడం లేదు. పాఠశాలలోని చిన్నారులందరూ ఈ పునుగుపిల్లులను వింతగా చూస్తున్నారు.
చినవెంకన్నను దర్శించుకున్న నాగఫణిశర్మ
ద్వారకాతిరుమల, జూన్ 27: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాడుగుల స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకొన్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆయనకు ఆలయ ఎఇఒ బొమ్మగంటి రామాచారి చిన్న వెంకన్న చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.