పశ్చిమగోదావరి

నీట మునిగిన నారుమడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జూన్ 28: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరి నారుమడులు నీటమునిగాయ. వీరవాసరం మండలంలో నీటమునిగిన ఆకుమడులను మంగళవారం వ్యవసాయశాఖ జెడి సాయిలక్ష్మీశ్వరి, భీమవరం వ్యవసాయశాఖ ఎడిఎ ఎల్‌బివి సత్యనారాయణ, ఎఒ రాజశేఖర్ పరిశీలించారు. బాలేపల్లి, మెంటేపూడి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఆకుమడుల్లో ఉన్న నీరు బయటకు పారడం లేదని, దీనివల్ల ఆకుమడులు కుళ్ళిపోతున్నాయన్నారు. దగ్గరలో ఉన్న డ్రైయినేజిలో నీరు కూడ వెళ్ళకపోవడంతో ఆకుమడులు పూర్తిగా మునిగిపోయాయని, దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎడిఎ ఎల్‌బివి సత్యనారాయణ మాట్లాడుతూ నీటమునిగిన ఆకుమడుల గురించి ఆందోళన చెందవద్దని, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి అధికారులు సిద్దంగా ఉన్నారన్నారు. ఇరిగేషన్ డిఇ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ బాలేపల్లి, దూసనపూడి గ్రామాలకు దగ్గరలో ఉన్న తొక్కోడు డ్రైయిన్‌లో నీటి ప్రవాహం పెరిగేలా చూస్తామన్నారు. రైతులు ఆదిరెడ్డి శంకర అప్పారావు, మతల చల్లారావు, మతల పెద్దబ్బాయి, గుల్లిపల్లి కిరణ్, ఆదిరెడ్డి దుర్గారావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.