పశ్చిమగోదావరి

పురపన్నులు ఆన్‌లైనులో చెల్లించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 28: ఇప్పటివరకు మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే జరుగుతున్న పురపాలక సంఘాల ఆస్తిపన్ను, కుళాయిపన్ను చెల్లింపులు ఇకపై ఆన్‌లైన్ ద్వారా నేరుగా చెల్లించవచ్చు. ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నుల ఇకపై ఇంటినుండి నేరుగా ఆయా మున్సిపాల్టీల బ్యాంకు అక్కౌంటుకు జమచేయవచ్చు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అన్ని పురపాలక సంఘాల్లోని కమిషనర్లు పురపాలక సంఘం పేరిట ఒక ఖాతా నెంబరుతో బ్యాంకు అకౌంట్లు ప్రారంభించారు. పట్టణవాసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరాసరిగా బ్యాంకు ఖాతాకే నగదు జమ చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో పన్ను చెల్లింపులు సులభతరమయ్యాయి. పన్ను చెల్లింపుల కోసం రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 2016-17 సంవత్సరానికి డిమాండు నోటీసులు సిద్ధం చేసి పంపిణీ కూడా పూర్తి చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారు ఈనెల 30లోగా వడ్డీ లేకుండా పన్నులు చెల్లించుకోవచ్చు. ఇక నుండి ఈ చెల్లింపులు ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలు, మీసేవా కేంద్రాలతో పాటు పురపాలక సంఘాల్లో కూడా జరగనున్నాయి. ప్రతీ ఆదివారం కూడా ప్రత్యేకంగా కౌంటర్లు తెరిపి ఉంచాలని మంత్రి నారాయణ కమిషనర్లను ఆదేశించారు. ఇక వారంలో ప్రతీ రోజూ పన్నుచెల్లింపు కౌంటర్ పురపాలక సంఘంలో తెరిచే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో ప్రతీ అంశాన్ని కూడా ఆన్‌లైన్‌కు పొందుపరిచింది. అలాగే పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను చెల్లింపులు తదితర అంశాలను ఆన్‌లైన్‌కు అనుసంధానంచేశారు. దీంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఎంతమేర చెల్లింపులు జరిగాయి, ఎంతమేర బకాయిలు ఉన్నాయి స్పష్టంగా తెలిసిపోతుంది. రెండేళ్ల క్రితం పురపాలక సంఘాల నుంచి ఎంత ఆదాయం వస్తుందనేది అంచనా వేయలేని పరిస్థితి నెలకొనేది. దీంతో ఏడాది పన్ను చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది నుంచే ఈ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. దీంతో ఎన్నికోట్లు ప్రభుత్వానికి ప్రజలు పన్నురూపేణా చెల్లిస్తున్నారో తెలిసింది. ఇక ఆ చెల్లింపులు నిర్ణీతకాలంలో జరిగేలా చర్యలు చేపట్టారు. పురపౌరులకు అన్ని సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నామో పన్ను చెల్లింపునకు కూడ అదేవిధంగా సౌకర్యాలు కల్పించాలని భావించి బ్యాంకు ఖాతా, మీసేవా లేదా పురపాలక సంఘాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌ల్లో చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించింది.