పశ్చిమగోదావరి

ముస్లింలకు కానుకగా రెండేళ్ల గౌరవ వేతనం, అలవెన్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 1 : నగరంలోని ముస్లింలందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని తమ రెండు సంవత్సరాల గౌరవ వేతనంతో పాటు అలవెన్సుల మొత్తం పది లక్షల రూపాయలను రంజాన్ తోఫాకు అర్హులైన ముస్లింలకు అందిస్తున్నట్లు నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. స్తానిక పవర్‌పేటలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పేద ముస్లిం లందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా పేరుతో అర్హులైన కార్డుదారులకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందిస్తున్నారన్నారు. ఈ పధకం ద్వారా నగరంలో నాలుగు వేల మంది ముస్లింలు లబ్ధిపొందనున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఈ రెండు సంవత్సరాలనుంచి ప్రభుత్వం తమకు ఇచ్చిన గౌరవ వేతనం, అలవెన్సులు మొత్తం పది లక్షల రూపాయలను రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కానుకగా ఇవ్వనున్నామన్నారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రంజాన్ తోఫాకు అర్హులైన ఒక్కొక్క కార్డుదారుడకు 250 రూపాయలు అందించనున్నామన్నారు. లబ్ధిదారులు వారి ఓరిజినల్ రేషన్ కార్డుతో తమ కార్యాలయంలో సంప్రదించాలని వారు కోరారు. రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని అర్హులైన ముస్లిం సోదరులకు తాము అందించే ఈ కానుకను స్వీకరించాలని వారు కోరారు. అనంతరం డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, విప్ గూడవల్లి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంలు మాట్లాడుతూ నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 30 కోట్ల రూపాయలతో అభివృద్ధిపనులను చేపట్టారన్నారు. ఈ నెల 5న పవర్‌పేటలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఏలరు నగరంలోని అర్హులైన ముస్లిం సోదరులు పాల్గొని మేయర్ దంపతులు అందించే ఈ కానుకను స్వీకరించాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు బౌరోతు బాలాజీ, కప్పా ఉమామహేశ్వరరావు, మారం హనుమంతరావు, పునుకొల్లు పార్ధసారధి పాల్గొన్నారు.