పశ్చిమగోదావరి

కమ్మరిగూడెం, గూటగుంపు గ్రామాల్లో విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, జూలై 1: మండలంలోని కమ్మరిగూడెం, గూటగుంపు గ్రామాల్లో శుక్రవారం ప్రభుత్వ వైద్యాధికారులు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వంద మంది రోగులను పరీక్షించి అందులో నలుగురు విషజ్వరాల బారినపడినట్టు గుర్తించారు. వారిని మెరుగైన వైద్యం కోసం మండల కేంద్రంలోని వైద్యశాలకు తరలించినట్టు, మిగిలిన 96 మందికి చిన్నచిన్న రొంప, దగ్గు తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మేఘన మాట్లాడుతూ వర్షాల వల్ల ఏర్పడిన వరదల కారణంగా చిన్నచిన్న రుగ్మతలు చోటుచేసుకుంటున్నందున అన్ని గ్రామాల్లో నిరవధిక వైద్యసేవలు కొనసాగిస్తామని, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందుల్లేకుండా ఉచితంగా మందులు సైతం పంపిణీ చేస్తామన్నారు.
శుక్రవారం నిర్వహించిన ఈ వైద్యశిబిరంలో తనతోపాటు డాక్టర్ ఇందురేఖ, సిబ్బంది రవి, హెల్త్ అసిస్టెంట్ శ్రీరాములు, ఎఎన్‌ఎంలు ఎస్తేరు, రాజ్యలక్ష్మి పాల్గొన్నట్టు ఆమె వివరించారు.