పశ్చిమగోదావరి

స్కూలు బస్సు ఢీ: రెండేళ్ల చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, జూలై 2: స్కూలు బస్సు ఢీకొని రెండు సంవత్సరాల పాప మృతిచెందిన ఘటన మండలంలోని ఉనకరమిల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉనకరమిల్లి గ్రామంలో సింగంశెట్టి మణికంఠ, ప్రశాంతి దంపతుల కుమార్తె దేవి లక్ష్మీ శరణ్య (4) మండలంలోని తిమ్మరాజుపాలెంలో ఎంసిఎస్ పాఠశాలలో ఎల్‌కెజి చదువుతోంది. రోజూలానే శనివారం సాయంత్రం పాఠశాల విడిచిన అనంతరం స్కూలు బస్సులో ఇంటివద్ద శరణ్యను దింపే సమయంలో తన తల్లి ప్రశాంతితోపాటు చెల్లెలు రిషిత (2) కూడా బస్సు వద్దకు వచ్చింది. అయితే బస్సులో నుండి శరణ్య దిగినవెంటనే తల్లి, చెల్లెలు వెనుకే వెళ్లారు. ఈ సమయంలో శరణ్య చెల్లెలు రిషిత బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. ఇది గమనించని బస్సు డ్రైవర్ ముందుకు పోనీవడంతో సంఘటనా స్థలంలోని రిషిత మృతిచెందింది. విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్ వెంటనే బస్సులో నుండి దిగి పరారయ్యాడు. సమిశ్రగూడెం ఎస్సై కె నరేంద్ర తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలవరం చేరుకున్న జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టరు

పోలవరం, జూలై 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టరు అజయ్‌కుమార్ శనివారం సాయంత్రం చేరుకున్నారని ఇఇ పుల్లారావు తెలిపారు. అజయ్‌కుమార్ ప్రాజెక్టులో ఉపయోగించే పునాది రాయిని పరీక్షించేందుకు వచ్చినట్టు తెలిపారు. శనివారం రాత్రి నుండి పరీక్షలు ప్రారంభించి, ఆదివారం సాయంకాలం వరకు కొనసాగించి తిరిగి వెళ్తారని ఇఇ వెల్లడించారు. అజయ్‌కుమార్ వెంట డిఇలు పేరయ్య, రాములు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.