పశ్చిమగోదావరి

స్మార్ట్ పల్స్ సర్వే సిబ్బందికి వేరే పనులు అప్పగిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 4: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు కేటాయించిన సిబ్బందికి వేరే పనులు అప్పచెప్పి వారిని తీయటంగాని చేస్తే హెచ్‌ఓడిల మీద చర్య తీసుకుంటామని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వేను ఈనెల 6వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా అమలుచేస్తామని, ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. కొంతమంది అధికారులు ప్రభుత్వం తమశాఖకు ఇచ్చిన ట్యాబ్‌లను సర్వే సిబ్బందికి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటివారిపై తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి సురక్షిత మంత్రాలయ అభియాన్ పధకం కింద ప్రతినెల 9వ తేదీన గర్భిణీస్ర్తిలకు జిల్లా ప్రభుత్వాసుపత్రి, మండల స్ధాయి ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. జిల్లాలో పదిలక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అయా ప్రభుత్వ కార్యాలయాల్లో కొద్దిపాటి స్ధలాన్ని మొక్కలు పెంచేందుకు కేటాయించాలన్నారు. ఎవరికి ఏ మొక్కలు కావాలో ఆసమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, నర్సరీల సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే అక్కడ నుండి మొక్కలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇ-ఆఫీస్ ద్వారా లక్షా 38వేల ఫైళ్లను నమోదు చేశామని, ఈనెలాఖరుకల్లా రెండులక్షల ఫైల్స్ నమోదు చేయాల్సి ఉందన్నారు. మీసేవలో ఇంకా గడువుదాటిన ఆర్జీలతో పాటు మిగిలినవాటిని కూడా వచ్చేవారానికి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. వేలేరుపాడు, కుకునూరు మండలాలకు సంబంధించి అటవీశాఖ ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన 34 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, డిఆర్వోఓ కె ప్రభాకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.