పశ్చిమగోదావరి

పట్టిసం రెండు మోటార్లు రేపు సిఎంతో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 4: పట్టిసం ఎత్తిపోతల పథకంలో సిఎం చంద్రబాబునాయుడు రెండు మోటార్లు ఆన్‌చేసి గోదావరి నీటిని ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తారని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టిసం చేరుకున్న కలెక్టర్ సిఎం పర్యటనా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు బుధవారం ఉదయం 9.30 గంటలకు పట్టిసం చేరుకుని 4, 5 నెంబర్ల మోటార్లను ఆన్‌చేస్తారన్నారు. అనంతరం డెలివరీ పాయింట్ వద్దకు చేరుకుని అక్కడ పరిశీలించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చేరుకుంటారని కలెక్టర్ వివరించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షిస్తారన్నారు. ముందుగా కలెక్టర్ ఎత్తిపోతల పథకం సమీపంలో ఉన్న వెంకటాపురం హెలిఫ్యాడ్‌ను పరిశీలించి, అక్కడ నుండి పట్టిసం ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని మోటార్లను పరిశీలించి, వాటి వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ పాయింట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ అక్కడ నుండి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఇంజనీరింగ్ అధికారులతో సిఎం పర్యటన వివరాలపై చర్చించారు. కలెక్టర్ భాస్కర్ వెంట డిఐజి పివిఎస్ రామకృష్ణ, డిఎస్పీ జె వెంకట్రావు, ప్రాజెక్టు ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు, ఆర్డీవో ఎస్ లవన్న, తహసీల్దార్ ఎం ముక్కంటి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.