పశ్చిమగోదావరి

సాటి మానవులను ఆదుకోవాలనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 5 : మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అన్న భావనకు అనుగుణంగా సాటి మానవులను ఆదుకోవడానికి కృషిచేస్తున్నామని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ అన్నారు. మేయర్‌గా ప్రభుత్వమిచ్చిన గౌరవ వేతనం పది లక్షల రూపాయలను రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. తన భర్త పెదబాబు వ్యాపార రంగంలో ఉండగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశీస్సులతో తమ కుటుంబం రాజకీయ రంగ ప్రవేశం చేసిందని ఆ నాటి నుండి పేదల సంక్షేమానికి ప్రభుత్వపరంగా అనేక కార్యక్రమాలు అమలుచేయడమే కాకుండా రెండు కోట్ల రూపాయలకు పైగా ఏలూరు నగరంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల భవన నిర్మాణాలకు స్వంత సొమ్ము విరాళాలుగా అందించామన్నారు. భవిష్యత్తులో కూడా తనకు, తన భర్త ఎస్ ఎం ఆర్ పెదబాబుకు ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తామని ఆ దిశగా అందరూ సహకరించాలని మేయర్ కోరారు. కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ సమాజమే దేవాలయం అని స్వర్గీయ ఎన్‌టిఆర్ చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుని సమాజంలో పేదల జీవితాల్లో వవెలుగు రేఖలు ప్రసరింపచేయడానికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు గవ్వా మధుసూదనరావు, కోమర్తి వేణుగోపాలరావు, పాలడుగు దీప్తి, మారం హనుమంతరావు, జిజ్జువరపు ప్రతాప్‌కుమార్, నాయుడు పోతురాజు, బుట్టి రత్నం, ఇలియాస్ పాషా, ఎల్లపు సత్యవతి పాల్గొన్నారు.