పశ్చిమగోదావరి

కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జూలై 7: కాపులను బిసి జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కాపుసంఘం జిల్లా అధ్యక్షులు చినిమిల్లి వెంకట్రాయుడు డిమాండ్ చేశారు. గురువారం పట్టణానికి విచ్చేసిన ఆయన స్థానిక తెలగా కల్యాణ మండపంలో విలేఖర్లతో మాట్లాడారు. కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు 1990లో కుట్టుస్వామి మిషన్‌ను వేశారన్నారు. తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం మంజునాథ కమిటీ వేసి కాలయాపన చేస్తోందని విమర్శించారు. టిడిపి ఎన్నికల హామీల్లో భాగంగా బిసి సోదరులకు ఇబ్బందిలేని విధంగా కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కాపు రిజర్వేషన్ అమలుకు సిఎం చంద్రబాబు వద్ద ఒత్తిడి తీసుకురావాలని వెంకట్రాయుడు కోరారు. కాపుసంఘం నాయకులు తమ్మిశెట్టి బాబ్జి, ప్రసాద్, దాసరి శ్రీనివాస్, తోట శ్రీ్ధర్, రామారావు, చినిమిల్లి వీరబాబు, అధికారి ఏసు, ఏసు, కె. లీలాగౌడ్ పాల్గొన్నారు.