పశ్చిమగోదావరి

ఆక్వా రైతాంగం కోసమే గోదావరి మెగాఆక్వా ఫుడ్‌పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 8: ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతాంగం కోసమే ప్రభుత్వం గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్కును మంజూరు చేసిందని రాష్ట్ర రైతుకార్యాచరణ సమితి పేర్కొంది. ఈ రైతాంగానికి ఈ ఫుడ్‌పార్కు వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొందరు చేస్తున్న ద్రుష్పచారాన్ని పరిగణనలోకి తీసుకుని భ్రయభ్రాంతులు చెందుతున్నారని తెలిపారు. ప్రజలు భ్రమలు వీడాలన్నారు. వెంటనే ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారంనాడు భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో రైతాంగ సమాఖ్య అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, భూపతిరాజు పాండురంగరాజు, గాదిరాజు నాగేశ్వరరాజు, లంకా కృష్ణమూర్తి మాట్లాడారు. ఇటీవల నరసాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఆవశ్యకతను వివరించారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దీని నిర్మాణం చేపడతారని స్పష్టం చేశారన్నారు. ఖచ్చితంగా మెగాఫుడ్‌పార్కును ఆక్వా రైతాంగం కోసం నిర్మించి విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆన్‌లైన్ భూమి వివరాల నమోదు విషయంలో 30శాతం తప్పులు ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 255, 271లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలను రద్దు చేయాలని కొద్దిరోజుల క్రితం రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తిని కలిసి వినతిపత్రం అందచేశామన్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండూరు గ్రామంలో నిర్వహించిన క్షేత్రస్ధాయి నిజనిర్దారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అదేవిధంగా ఈనెల 11వ తేదీన గుడివాడ, 14వ తేదీన గుంటూరు, కడప, 15వ తేదీన రాజమహేంద్రవరం, రామచంద్రపురంలలో క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మేళం దుర్గాప్రసాద్, చినమిల్లి వీరబాబు, యర్రా రుషికేశ్వరరావు, తమ్మినీడి నాగేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.