పశ్చిమగోదావరి

గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 8: భారతదేశంలో ఉన్న 12 జీవనదుల్లో పవిత్రమైన గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు ఉంటాయని ధర్మరక్షావేదిక జిల్లా అధ్యక్షులు తోరం సూర్యనారాయణ అన్నారు. ఇంతటి పవిత్రమైన నదికి జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగుతాయన్నారు. ఈ కాలంలో గోదావరి నదిలో పవిత్రమైన పుణ్యస్నానాలు చేసి పవిత్రులు కావాలన్నారు. శుక్రవారం ధర్మరక్షావేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గోదావరి పుష్కరాలు సందర్భంగా ఏడాది పొడవునా 33కోట్ల దేవతలు అనగా త్రిమూర్తులు, కాశీ నుండి గంగామాత, జలదేవతలు ఈ పుణ్యతీర్ధంలో ఉంటారన్నారు. ఈ పుష్కరకాలంలో ప్రతీ ఒక్కరూ సాంప్రదాయాలను పాటించాలన్నారు. అంత్య పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ అంత్య పుష్కరాలు సందర్భంగా గోదావరి నదీకి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ధర్మరక్షావేదిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం, సేవలు చేయడం జరుగుతుందన్నారు. గోదావరి నది వెంబడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ముఖ్యప్రాంతాల నదీ ఒడ్డున గోదావరికి హారతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ గోదావరి అంత్య పుష్కరాలకు హిందూ బంధువులు తరలిరావాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ గరికిముక్కు సుబ్బయ్య, హిందూ చైతన్య వేదిక నగర అధ్యక్షులు రావూరి అనంత్ పాల్గొన్నారు.