పశ్చిమగోదావరి

ఫైనల్స్‌కు జాతీయ టెన్నిస్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం: జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు శనివారం రాత్రి ఫైనల్స్ దశకు చేరుకున్నాయి. స్థానిక ఆఫీసర్స్ క్లబ్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో ఫైనల్స్‌లో బెర్తు దక్కించుకునేందుకు క్రీడాకారులు వీరోచితంగా పోరాడారు. ఆదివారం ఉదయం నుంచి ఫైనల్స్ నిర్వహిస్తారు. ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. 65 ప్లస్ సింగిల్స్ విభాగంలో కె.రాధాకృష్ణ మూర్తి (ఆంధ్ర), డాక్టర్ రామ్మోహనరావు (తెలంగాణ)లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. 65 ప్లస్ డబుల్స్ విభాగంలో ఎస్.్ఫరీఖ్ (మహారాష్ట్ర), పద్మాలు (ఆంధ్ర), మదన్‌మోహన్ సింగ్ (తెలంగాణ), సిపి రాజు (ఆంధ్ర)లు ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నారు. 55 ప్లస్ సింగిల్స్ విభాగంలో యోగేషా (గుజరాత్), సుదర్శనరావు (ఆంధ్ర)లు ఫైనల్స్‌కు చేరారు. 55ప్లస్ డబుల్స్ విభాగంలో మన్మధరావు (ఆంధ్ర), ధనుంజయలు (ఆంధ్ర), ఆర్వీ రామరాజు (తెలంగాణ), మేఘనాధ్ (తమిళనాడు)లు ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. 45 ప్లస్ సింగిల్స్ విభాగంలో కెజి రమేష్ (తమిళనాడు), ఆర్ముఖం (కర్నాటక)లు ఫైనల్స్‌లో ఆడనున్నారు. 45 ప్లస్ డబుల్స్ విభాగంలో ఆర్మూఖం (కర్నాటక), కెవిఎన్ మూర్తి (తెలంగాణ)లు పైనల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.