పశ్చిమగోదావరి

కృష్ణా పుష్కరాల్లో సేవలందించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూలై 17: హిందూ ధర్మ సంస్కృతిని పరిరక్షిస్తూనే రాబోయే కృష్ణా పుష్కరాల్లో భక్తులకు సేవలందించేందుకు విశ్వహిందూ పరిషత్ కృషిచేస్తుందని విహెచ్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు తనికెళ్ళ సత్యరవికుమార్ అన్నారు. మండలంలోని గుర్వాయగూడెంలో శ్రీ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఆదివారం అధ్యక్షులు విబిఎన్ శాస్ర్తీ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా పుష్కరాలకు ఘాట్లను సిద్ధంచేయాలని, అభివృద్ధి సాకుతో విజయవాడలో తొలగించిన హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు విహెచ్‌పి ఆధ్వర్యంలో స్నానాది, భోజన వసతులు కల్పించటానికి కృషిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొనకళ్ళ వెంకటేశ్వరరావు, జిల్లా గోసంరక్షణ సమితి కన్వీనర్ కొంచాడ దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షులు కాకి చంటి, ప్రభాకర్ చార్యులు, కనుపర్తి రామకృష్ణ, జ్యోతిక్రాశ్, చెలికాని భాస్కరరావు, రామారావు, నాగరాజు, కృష్ణకుమార్ పాల్గొన్నారు.