పశ్చిమగోదావరి

గేట్‌లో కాళీపట్నం విద్యార్థికి 180వ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామానికి చెందిన సత్తినేని పెద్దిరాజు కుమారుడు మనోజ్ గెట్ ఎంట్రన్స్ పరీక్షలో ఇండియాలో 180వ ర్యాంకు సాధించాడు. గెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం విదితమే. మనోజ్ టెన్త్‌లో మండల టాపర్‌గా నిలిచాడు. కాగా మనోజ్ గెట్ ఎంట్రన్స్ పరీక్షలో ఇండియాలో 180వ ర్యాంకర్‌గా నిలవడం పట్ల నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, మొగల్తూరు మాజీ ఎంపిపి కొప్పినీడి వెంకటలక్ష్మి, కాళీపట్నం గ్రామ సర్పంచ్ మారుబోయిన సుజాత, ఎంపిటిసి మాదాసు కుమారి, మాజీ ఎంపిటిసి బొక్క ఏడుకొండలు, ఎంఇఒ సిహెచ్ ప్రభాకరరావు, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు గట్టెం శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.

వెలి ఘటనపై కేసు నమోదు

ఆచంట, మార్చి 19: ఆచంట శివారు వంకతాళ్ళచెరువు గ్రామంలో చోటుచేసుకున్న సంఘ బహిష్కరణ, వెలి ఘటనపై ఆచంట పోలీసులు బాధ్యులైన గ్రామపెద్దలపై శనివారం కేసు నమోదుచేశారు. హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను సంఘం నుండి బహిష్కరించి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు బాధితులు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామపెద్దలుగా వ్యవహరిస్తున్న ఐదుగురిపై కేసు నమోదుచేశారు. వెలి, వేధింపులకు పాల్పడడం, దౌర్జన్యం చేయడం, ఆస్తుల ధ్వంసానికి ప్రయత్నించడం వంటి ఆరోపణలపై ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. పాలకొల్లు రూరల్ సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసు దరాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు.