పశ్చిమగోదావరి

ఏలూరులో పిస్టల్‌తో హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 17 : నగరంలో జూన్ 28వ తేదీ రాత్రి సంచలనం సృష్టించి పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజుపై పిస్టల్‌తో హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏలూరు డి ఎస్‌పి గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి నగర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత కక్షల నేపధ్యంలోనే నాగరాజుపై పిస్టల్‌తో ఆరోజు రాత్రి 9 గంటలకు హత్యాయత్నానికి పాల్పడ్డారని వివరించారు. రామకోటి ప్రాంగణంలో గల ఎస్‌బి ఐ ఎటి ఎం వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న నాగరాజుపై నిందితులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారన్నారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరిగిరి శ్రీనివాస్, ఊర కొండ, భూతం గోవింద్, భూతం శ్రీనివాస్ మరికొందరిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. నగర సి ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్ ఐలు కె రామారావు, ఎన్ రాంబాబులు సిబ్బందితో ప్రణాళిక రూపొందించి నిందితులను ఆదివారం ఉదయం హనుమాన్‌జంక్షన్‌లో అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో పినకడిమికి చెందిన తూరపాటి పెదబాబు, ఆర్ ఆర్ పేటకు చోడవరపు దీపక్ కుమార్ స్వామి, పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సూరంపల్లి రాజేష్, ఇర్ఫాన్‌లను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల్లో ప్రధముడైన పెదబాబు తూరపాటి నాగరాజు సోదరుడి కొడుకని, అతను పధకాన్ని రూపొందించాడని అన్నారు. 2010వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో తూరపాటి నాగరాజుకు స్వయాన మామ, బావమరిది అయిన గంధం నాగేశ్వరరావు, గంధం మారియ, గంధం పగిడి మారియ్యలను కృష్ణాజిల్లా పెద అవుటపల్లి వద్ద కాల్చి చంపినవారిలో కూడా పెదబాబు నిందితుడని చెప్పారు. దాదాపు ఎనిమిది నెలలు జైలు జీవితం గడిపి విడుదలైన పెదబాబు నాగరాజును ఎలాగైనా హతమార్చాలని అతని స్నేహితులైన రాజేష్, దీపక్, ఇర్ఫాన్, వంశీకృష్ణలతో కలిసి ఏలూరులోని ఒక హోటల్‌లో వంశీ కృష్ణ పేరిట రూమ్ తీసుకుని పధకం రూపొందించారన్నారు. పెదబాబు ఢిల్లీలో సింగ్ అనే వ్యక్తి నుంచి 50 వేల రూపాయలకు పిస్టల్ కొనుగోలుచేసి అనంతరం హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. డి ఎస్‌పి వెంట నగర సి ఐ ఎన్ రాజశేఖర్, వన్‌టౌన్ ఎస్ ఐలు కె రామారావు, ఎన్ రాంబాబు, కానిస్టేబుల్స్ వున్నారు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించేందుకు సహకరించిన కానిస్టేబుల్స్ షేక్ రఫీ, వి సీతయ్య, ఐ విజయరాజులకు రివార్డులను అందజేశారు.

ఆంధ్రభూమి బ్యూరో