పశ్చిమగోదావరి

ఎస్సై పేరుతో టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జూలై 19: తాను కొత్తగా వచ్చిన ఎస్సైనని, తనతో రావాలంటూ ఇరువురు విద్యార్థులను వేరే గ్రామానికి తీసుకువెళ్ళి వారి వద్ద ఉన్న సుమారు 20 గ్రాములు బంగారు గొలుసు, ఉంగరం అపహరింఛిన సంఘటన మంగళవారం వీరవాసరంలో సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరవాసరం బొంతువారిపేటకు చెందిన తాడపర్తి అనిల్ వీరవాసరం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బాలేపల్లి గ్రామానికి చెందిన అడిదం మోషే ఐటిఐ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇరువురు జూనియర్ కళాశాల వద్ద నిల్చుని ఉండగా, మోటారుసైకిల్ పై ఒక వ్యక్తి వచ్చి మీరెవరంటూ ప్రశ్నించాడు. తాము ఇక్కడ చదువుకుంటున్నామని చెప్పారు. ఆగంతకుడు తాను వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఎస్సైనని, ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై బదిలీపై వెళ్లిపోయారని, తనకు దగ్గరలో అద్దె ఇల్లు ఏమైనా ఉంటే చూపించాలని కోరాడు. ఆ ఇరువురు యువకులను బైక్‌పై ఎక్కించుకుని శృంగవృక్షం వరకు తీసుకువెళ్ళాడు. శృంగవృక్షం గ్రామంలో ఉయ్యాల స్తంభాల వద్దకు తీసుకువెళ్ళిన తరువాత డిఎస్పీగారి ఇంటికి వెళ్ళాలని చెబుతూ అనిల్ మెడలో ఉన్న గొలుసు, ఉంగారాన్ని మోషేకు ఇవ్వాల్సిందిగా చెప్పాడు. అనిల్ ఆ విధంగా చేశాడు. అనంతరం మోషేను అక్కడే ఉండమని, అనిల్‌ను కొంతదూరం తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడే ఉండమని ఆగంతకుడు పేర్కొన్నాడు. వెంటనే ఆగంతకుడు మోషే వద్దకు వచ్చి అతని వద్ద ఉన్న బంగారాన్ని ఇవ్వాలని అడిగాడు. దీంతో మోషే బంగారాన్ని ఆగంతకుడికి ఇచ్చాడు. ఇక్కడే ఉండమని ఆగంతకుడు మోషేకు చెప్పి పరారయ్యాడు. ఎంతసేపటికి రాకపోవడంతో ఇరువురు నడుచుకుంటూ వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. జరిగిన విషయాన్ని వీరవాసరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై సుబ్రహ్మణ్యం వారి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పరారైన ఆగంతకుడు శృంగవృక్షం గ్రామంలోని సిసి కెమెరాలకు చిక్కాడు. ఆ ఫొటోలను మోసపోయిన యువకులకు చూపించగా, అతనేనని గుర్తించారు.