పశ్చిమగోదావరి

ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పశ్చిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 22 : పర్యాటక రంగాభివృద్ధికి అనువైనదిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచాలని రాష్ట్ర శాసనసభ హామీల అమలు కమిటీ ఛైర్మన్ పెందుర్తి వెంకటేష్ అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాకు చెందిన పెండింగ్‌లో వున్న పది హామీల అమలుపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ సమక్షంలో కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ అభివృద్ధిలో పర్యాటకరంగం ఒక భాగమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పలు మార్గదర్శకాలను నిర్దేశించడం జరిగిందన్నారు. పశ్చిమలో పాపికొండలు, కొల్లేరు, పేరుపాలెం బీచ్‌లతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల వంటివి చోటు చేసుకున్న కారణంగా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో వెసులుబాటు ఉందన్నారు. ఈ ప్రాంతానికి విదేశీయులు కూడా వస్తున్న కారణంగా అవసరమైతే సి ఎస్ ఆర్ క్రింద నిధులను పెట్టుకుని పర్యాటకరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నం చేయాలని ఈ విషయంలో జిల్లా కలెక్టరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ అభివృద్ధిపై వచ్చిన చర్చలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పేరుపాలెం బీచ్ అభివృద్ధికి వంద ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించలేదని మొగల్తూరు తహశీల్దార్ నివేదిక ప్రకారం అందుబాటులో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ వారికి కేటాయించడం జరిగిందన్నారు. అయితే పనులు ప్రారంభించిన తర్వాత ఆ భూమిని ఆక్రమించుకున్న ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఆయన తెలియజేశారు. జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను కూడా నియమించడం జరిగిందన్నారు. పాలకొల్లు సమీపంలో పాలవెల్లిలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో టూరిజం రిసార్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిపై కమిటీ ఛైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ దీనికి సంబంధించి పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం సైట్ లోనే ఆన్‌లైన్ టిక్కెట్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు నదిగట్టులకు పడే నష్టాలను నివారించేందుకు తీసుకున్న చర్యలపై జరిగిన సమీక్షలో ఇందుకు సంబంధించి 95శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన అయిదు శాతం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖాధికారులను కమిటీ ఆదేశించింది. వరదగట్టుల సమీపంలో ఇసుక తవ్వకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన చర్చకు ఎఎస్‌పి చంద్రశేఖరరావు సమాధానమిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సిబ్బందిని నియమించామని చెప్పారు. దీనిపై కమిటీ ఛైర్మన్ వెంకటేష్, జిల్లా పరిషత్తు ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ కేవలం సిబ్బందిని నియమిస్తే సమస్య పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారానికి స్థానిక పురపాలక, రెవిన్యూ, ఆర్ అండ్ బి, పోలీసు, తదితర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా రోడ్డు ఆక్రమణలను తొలిదశలోనే పట్టించుకోకపోవడ వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. జడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో నిర్వహించే రోడ్డు భద్రతా సమావేశంలో ఈ అంశంపై సమీక్షిస్తామని చెప్పారు. జిల్లాలో ఇళ్ల స్థలాల మెరక పనులకు సంబందించి వచ్చిన చర్చలో ఛైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ భూమి మెరక పనులకు 1.43 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపారని, తదుపరి దీనిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని అధికారులను కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2003లో నిధులు కోసం ప్రతిపాదించినప్పటికీ 2012లో నిధులు అందగా పనులు పూర్తిచేయడం జరిగిందన్నారు. తదుపరి 2014లో 30 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇదే సందర్భంలో మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి భూమి మెరక పనులకు 30 కోట్ల రూపాయలు తెచ్చుకోవడంతోపాటు వాటిని ప్రక్కనపెట్టి మరో ప్రక్క నీరు-చెట్టు, ఎన్ ఆర్‌జి ఎస్ ద్వారా పనులు నిర్వహఙంచుకుని అనంతరం 30 కోట్ల రూపాయలను వినియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. వేములదీవి పరస్పర సహాయ సహకార సొసైటీలో జరిగిన అవకతవకలపై చేపట్టిన విచారణ గురించి, రవి ఎడ్యుకేషనల్ సొసైటీ జారీ చేసిన ఇంజనీరింగ్ నకిలీ సర్ట్ఫికెట్లు ముద్రించిన అభియోగాలపై తీసుకున్న చర్యలపై కమిటీ సమీక్షించారు. జిల్లాలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన విషయంపై కూడా కమిటీ సమీక్షించింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుచేసిన తీరుపై కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా వెలుగు గ్రూపులకు లభించిన 30 కోట్ల రూపాయలు కమిషన్ ఏ విధంగా ఖర్చు చేస్తున్నదీ వివరాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు సంబంధించి 10 హామీలు అమలు చేయవలసి వుండగా వాటిలో ఏడు హామీలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేయగా మరో మూడు హామీలను పెండింగ్‌లో ఉంచడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన బాపట్ల ఎమ్మెల్యే కె రఘుపతి, మండపేట ఎమ్మెల్యే జె జోగేశ్వరరావు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలతోపాటు జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జెసి పి కోటేశ్వరరావు, ఎ ఎస్‌పి చంద్రశేఖరరావు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.