పశ్చిమగోదావరి

ఇక పట్టణ గృహాల మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఎన్‌టి ఆర్ గృహాల కోసం ప్రజలంతా ఎంతోకాలంగా వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదలైనా పూర్తిస్థాయి స్పష్టత రాకపోవడంతో దీని కోసం లబ్ధిదారులంతా ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణాలుచేస్తూనే వచ్చారు. తాజా పరిణామాల్లో ప్రభుత్వం ఎన్‌టి ఆర్ హౌసింగ్‌లో పట్టణ గృహాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా జిల్లాలో మొత్తం 1910 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీనిలోనూ ఏలూరు నియోజకవర్గానికి ఎక్కువ కేటాయింపులు జరిగినట్లు కనిపిస్తోంది. అయితే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఏలూరులో ఇళ్ల అవసరాలు, జనాభా సంఖ్య కూడా భారీగా ఉండటంతో ప్రస్తుతం కేటాయించిన మొత్తం సరిపడిన రీతిలో వుందా? లేదా? అన్న విషయంలోనూ కొన్ని సందేహాలున్నాయి. ఏది ఏమైనా ఏలూరు నగరానికి 1190, తాడేపల్లిగూడెం పట్టణానికి 410, పాలకొల్లు పట్టణానికి 310 మేరకు ఈ గృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇక త్వరలోనే దీనికి సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్‌టి ఆర్ గృహాల నిర్మాణం పరుగులు తీస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ పధకంలో ఒక్కొక్క గృహానికి ఏకంగా మూడున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని నిర్ధారించారు. దీనిలో లబ్ధిదారుని వాటాగా 25 వేల రూపాయలు ఉండగా కేంద్ర ప్రభుత్వం సహాయం కింద ఒకటిన్నర లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కింద లక్ష రూపాయలు రుణం రూపంలో 75 వేల రూపాయలు కలిసి మొత్తం మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టవచ్చు. అంతేకాకుండా గతంతో పోలిస్తే ఈ పధకంలో ఆర్ధిక సహాయం మొత్తం అధికంగా లభించడంతోపాటు లబ్ధిదారులకు టుబెడ్‌రూమ్ ఇల్లు కట్టించి ఇస్తారు. ఈ రకంగా నిర్మించే ఇంటిలో రెండుబెడ్‌రూమ్‌లు, ఒక హాల్, ఒక కిచెన్, బాత్‌రూమ్ వుంటాయి. దీనిలో కనీసం 30 చదరపు మీటర్లు (323 చదరపు అడుగులు) మేరకు నిర్మిత ప్రాంతం వుండాలి. అలాగే ఈ పధకంలో నిర్మించే గృహాలకు సంబంధించి ప్రత్యేక డిజైన్లను కూడా సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాలు, ఆయా లబ్ధిదారులకు అనువుగా వుండే డిజైన్‌ను ఎంపిక చేసుకుని ఆ మేరకు నిర్మాణం ముందుకు తీసుకువెళ్లే అవకాశం వుంటుంది. దీనిలో లబ్ధిదారులకు అందించాల్సిన రుణాలకు సంబంధించి ఆయా జిల్లా యంత్రాంగాలు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. అలాగే లబ్ధిదారుల ఎంపికను కూడా ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహిస్తారు. మొత్తంగా చూస్తే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలతో గృహాల లబ్ధిదారుల ఆశకు సంబంధించి కొంత వరకు పరిష్కారం లభించినట్లే కనిపిస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర నుంచి సొంత ఇల్లు కోసం వందలు వేల మంది లబ్ధిదారులు ఆయా ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకుంటూనే వున్నారు. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి పరిష్కారం లభిస్తుందన్న ప్రకటనలు వెలువడటం మినహా వాస్తవంగా వాటికి సంబంధించి ఆదేశాలు వచ్చిన దాఖలాలు లేకుండా పోయాయి. ఇటీవల కొద్దికాలం క్రితం ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణ పధకాన్ని తెరపైకి తీసుకురావడం తెలిసిందే. దీనిలో ఎంతో మంది గృహాల నిర్మాణానికి ముందుకు వచ్చారు. అయితే నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో ఈ వ్యవహారం ప్రతిష్టంభనలోనే కొనసాగుతూ వచ్చింది. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులు నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే వచ్చారు. ఈ నేపధ్యంలో తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఎన్ టి ఆర్ గృహ నిర్మాణ పధకాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అనువైన రీతిలో ఆదేశాలు వెలువడటం లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం కావడానికి కారణమవుతోంది.