పశ్చిమగోదావరి

బిసిలు ఉద్యమ బాట పట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, జూలై 24: బిసిల హక్కులు, రిజర్వేషన్లు రక్షించేందుకు బిసిలు ఉద్యమ బాట పట్టాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పివి పెద్దిరాజు పిలుపునిచ్చారు. టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కల్పించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాపులు తన్నుకుపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని బిసి రిజర్వేషన్ ద్వారా పదవులు అనుభవిస్తున్న సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, ఎంపిపిలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమబాట పట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని పెద్దిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఉంగుటూరులో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలు చైతన్యవంతులుగా మారకపోతే, ఉద్యమ బాట పట్టకపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినవారమవుతామని హెచ్చరించారు. ఏనాడో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బిసి రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతుంటే రిజర్వేషన్ ఫలాలు బిసిలకు అందకుండా చేసేందుకు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్న విషయాన్ని బిసిలు గ్రహించాలన్నారు. బిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు, బిసిలకు రుణాల మంజూరులో పూర్తిస్థాయిలో నిధులు మంజూరుచేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బలమైన సామాజిక వర్గమైన కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాన్ని బిసిలు ఎండగట్టాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండీ బిసిలుగా ఉన్న కులాలు నేటికీ దారిద్య్ర రేఖకు దిగువనే మగ్గుతుంటే వార్ని పైకి తీసుకురావలసిన ప్రభుత్వాలు రాజకీయ ఉనికి కోసం ఉన్నత కులాల వార్ని బిసిలుగా మార్చి వారికి ఉపకార వేతనాలు, రుణాలు మంజూరు చేయడాన్ని బిసిలు గ్రహించాలన్నారు. బిసిలు ఇలాగే ఉంటే..స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత ఫలాలు భావితరాలకు అందకుండా పోయే ప్రమాదం ఉందని పెద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు.