పశ్చిమగోదావరి

మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 25 : ఉపాధి హామీ పధకంలో జిల్లాలో మంజూరు కాబడిన మరుగుదొడ్లు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపిడివో, తహసీల్దార్లను కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎండివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం కింద నిర్వహించే పనుల బాధ్యత ఎంపిడివోలపై ఉందని ఈ విషయంలో శ్రద్ధగా పనులు చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని చెప్పారు. చింతలపూడిలో 287 టాయిలెట్స్ మంజూరు చేయడం జరిగిందని, అయినప్పటికీ 50 శాతం కూడా పనులు పూర్తికాపోవడం పట్ల కలెక్టర్ ఎంపిడివోను ప్రశ్నించారు. ఈ ఆర్ధిక సంవత్సరం మొదలై అయిదు నెలలు అయినప్పటికీ పనులు మందకొడిగా సాగడం పట్ల కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ వీడియో సమీక్షా కార్యక్రమంలో వచ్చే వారానికి పనులు పూర్తిచేస్తామని చెబుతున్నారని ఇది సరైన పద్దతి కాదని, ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుందని తహశీల్దార్లు, ఎంపిడివోలతో చెప్పారు. జిల్లాలో 25 వేల పంట నీటికుంటలు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి వుండగా దీనిపై శ్రద్ధ వహించకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రతీ మండలంలో రోజుకు పది ఫామ్ పాండ్స్, పది టాయిలెట్స్ పనులు చేప్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోషల్ ఆడిట్, సమీక్ష సమావేశాలు జరిగే సమయంలో సంబంధిత మండలాధికారులకు మాత్రమే పని కొంత ఆలస్యం అవుతుందని మిగిలిన మండలాల్లో అధికారులు అందరూ వారి పనులు వారు నిర్వర్తించుకోవాలని పనులు కాకపోవడానికి సమావేశాలు, సోషల్ ఆడిట్‌లు కారణమని సాకులు చెప్పడం సరైన పద్దతి కాదని అధికారులను హెచ్చరించారు. జిల్లాలో 5.38 లక్షల జాబ్ కార్డులు మంజూరు చేయాల్సి వుండగా రెండు లక్షల జాబ్‌కార్డులు మాత్రమే మంజూరు చేసారని మిగిలినవి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. వర్మీకంపోస్టు పనులు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు చేసి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలస్థాయిలో పనులు మందకొడిగా సాగుతున్నప్పటికీ తప్పుడు నివేదికలు పంపడం సజరైన పద్దతి కాదన్నారు. జిల్లాలో మంజూరు చేసిన పనులను వచ్చే వారం నాటికి 50 శాతం పనులు పూర్తి చేసేందుకు ఎంపిడివోలు, తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పధకం కింద మరుగుదొడ్లు పనులు తక్కువగా మంజూరు చేసినప్పటికీ అవి కూడా పూర్తి చేయకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డ్వామా పిడి వెంకటరమణ, బిసి కార్పొరేషన్ ఇడి పెంటోజీరావు, డిపివో కె సుధాకర్, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, జడ్పీ సి ఇవో డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.